ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మలకు ఇప్పుడు అవకాశాలు కరువయ్యాయనే చెప్పాలి. ఈ లిస్ట్ లో చాలా మంది అందగత్తెలు ఉన్నారు. కొత్త అందాలు నిత్యం పలకరిస్తూ ఉండటంతో ముందు జనరేషన్ హీరోయిన్స్ కు అవకాశాలు తగ్గిపోతున్నాయి. అలా కనుమరుగైన భామల్లో మీరాజాస్మిన్(Meera Jasmine) కూడా ఒకరు. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేసి తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ అందాల భామ. సినిమాల్లో ఉన్నన్ని రోజులు స్కిన్ షో కు దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి మెప్పించింది మీరాజాస్మిన్. రవితేజ సరసన భద్ర, పవన్ కళ్యాణ్ నటించిన గుడుంబా శంకర్, విశాల్ నటించిన పందెంకోడి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే రాజశేఖర్ ప్రధానపాత్రలో వచ్చిన గోరింటాకు సినిమాలో నటించి అలరించింది. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు చేసిన మీరాజాస్మిన్ ఆ తర్వాత సినిమాలకు దూరం అయ్యింది.
కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న మీరాజాస్మిన్ తాజాగా యాక్టివ్ అయ్యింది. సోషల్ మీడియా వేదికగా సంచలనం సృష్టిస్తుంది. ఎప్పుడూలేనంతగా హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెట్టింట వైరల్ అవుతోంది. అందాలు ఆరబోస్తూ కుర్రకారుకు వలలు వేస్తోంది. నిత్యం రకరకాల ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది మీరాజాస్మిన్. తాజాగా ఈ అమ్మడు పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. యాంగ్ బ్యూటీస్ కు ఏమాత్రం తగ్గకుండా హాట్ హాట్ ఫోజులతో మతిపోగొడుతోంది. ఇక ఈ ఫోటోలపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. పెరుగుతుంది వయసా ..? లేక అందమా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..