మనోజ్ బాజ్‌పాయ్ .. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన హ్యాపీ సినిమాలో డీసీపీ గా నటించి మెప్పించారు మనోజ్. అలాగే వేదం సినిమాలో అద్భుతమైన పాత్రలో నటించి ఆకట్టుకున్నారు మనోజ్ బాజ్‌పాయ్. హ్యాపీ కంటే ముందు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో సుమంత్ నటించిన ప్రేమకథ సినిమాలో హీరోయిన్ అన్న పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు మనోజ్. బాలీవుడ్ లో విలక్షణ నటుడిగా రాణిస్తున్నారు మనోజ్. వేదం సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కొమురం పులి సినిమాలో నెగిటివ్ పాత్రలో నటించి అలరించారు. ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో ఆయన తెలుగు సినిమాల్లో నటించలేదు. బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇక రీసెంట్ గా ఫ్యామిలీ మెన్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇదిలా ఉంటే త్వరలోనే మనోజ్ బాజ్‌పాయ్ నటించిన సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లోనూ విడుదల కానుంది. ఈ సినిమాలో మనోజ్ లాయర్ గా కనిపించనున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు ఈ వర్సటైల్ యాక్టర్.
తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న మనోజ్ కు మీరు కాకుండా ఈ సినిమాలో ఏ టాలీవుడ్ యాక్టర్ నటించాలని మీరు అనుకుంటున్నారు.? అనే ప్రశ్న ఎదురైంది. దానికి మనోజ్ స్పందిస్తూ.. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లో లాయర్ గా నటించేశారు. మహేష్ బాబుకు ఈ పాత్ర చాలా బాగా సూట్ అవుతుంది. ఆయన నటిస్తే బాగుంటుంది అని అన్నారు. దాంతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. మహేష్ తన కెరీర్ లో ఇంతవారు లాయర్ పాత్రలో నటించలేదు. త్వరలో నటిస్తారేమో చూడాలి.