
సాధారమంగా సినీరంగంలోని హీరోయిన్లకు ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. తమకు ఇష్టమైన తారలను ఆరాధించేవాళ్లు చాలా మంది ఉంటారు. హీరోయిన్లు బయట కనిపిస్తే వారితో సెల్ఫీ దిగాలని ఫ్యాన్స్ చేసే ఆత్యుత్సాహం గురించి తెలిసిందే. ఇప్పుడు సోషల్ మీడియా ప్రపంచంలో తమకు ఇష్టమైన తారలతో నేరుగా ముచ్చటిస్తున్నారు. సెలబ్రెటీలు సైతం అభిమానులతో నెట్టింట చిట్ చాట్ నిర్వహిస్తుంటారు. ఇదివరకు చాలా మంది హీరోయిన్లకు ఫ్యాన్స్ నుంచి ప్రేమ, పెళ్లి ప్రపోజల్స్ వస్తుంటాయి. తాజాగా మలయాళీ ఇండస్ట్రీకి చెందిన ఓ హీరోయిన్ సనా ఆల్తఫ్ కు ఓ బిజినెస్ మెన్ నుంచి అలాంటి ప్రపోజల్ వచ్చింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షార్ట్స్ షేర్ చేసింది.
ఇవి కూడా చదవండి : Folk Song : యూట్యూబ్లో కోట్ల వ్యూస్.. నెల రోజులుగా ఇంటర్నెట్ షేక్.. ఇప్పటికీ దూసుకుపోతున్న పాట..
డేట్ కు రమ్మని ఓ వ్యక్తి తనకు పదే పదే మెసేజ్ చేస్తున్నాడని.. ఈమెయిల్ లో ప్రతిసారి ఏదోక మెసేజ్ చేస్తున్నాడని తెలిపింది. సనా షేర్ చేసిన స్క్రీన్ షార్ట్స్ లో ఏముందంటే.. ‘డియర్ సనా.. ఎలా ఉన్నావు.. ? నేను చెన్నైకి చెందిన వ్యాపారవేత్త బాలాజీని. నాకు నీతో డేటింగ్ ను వెళ్లాలని ఉంది. దానికి ఎంత తీసుకుంటావో చెప్పు. నీకు ఎప్పుడు వీలవుతుందో చెప్పు. నీ విలును బట్టి మనం ప్రోగ్రామ్ చేసుకుందాం. ఇండియాలో లేదా మాల్దీవులు, దుబాయ్ కు వెళ్దాం. ఒక్కసారి ఆలోచించు’ అంటూ అతడు రాసుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి : Actor Suresh: సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. ఒక్క మాటలో చెప్పేసిన సీనియర్ హీరో..
ఒకే వ్యక్తి నుంచి తనకు పలుమార్లు మెయిల్స్ వచ్చాయని రాసుకొచ్చింది. అతడు తనకు ఎంత ప్రొఫెషనల్ గా.. రొమాంటిక్ గా ప్రపోజ్ చేశాడో అంటూ సరదాగా కామెంట్ చేసింది. సనా ఆల్తఫ్ మలయాళంలోకి విక్రమాదిత్య సినిమాతో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఫహద్ ఫాజిల్ సరసన హీరోయిన్ గా నటించింది. మలయాళంలో పలు సినిమాలు నటించింది.
ఇవి కూడా చదవండి : Ranu Bombaiki Ranu Song : యూట్యూబ్ సెన్సేషన్.. రానూ బొంబాయికి రాను పాటకు ఎంత అమౌంట్ ఇచ్చారంటే.. డ్యాన్సర్ లిఖిత కామెంట్స్..
ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..