అల్లు  అర్జున్ సరసన మలయాళ ముద్దుగుమ్మ.. రాకలో ఆ అమ్మడు కూడా..

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నారు. ఇటీవలే పుష్ప సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు అల్లు అర్జున్, పుష్ప 1 అలాగే పుష్ప 2 రెండు సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి.

అల్లు  అర్జున్ సరసన మలయాళ ముద్దుగుమ్మ.. రాకలో ఆ అమ్మడు కూడా..
Allu Arjun

Updated on: Jun 01, 2026 | 5:13 PM

ఐకాన్ స్టార్ అల్లు  అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. దాంతో దేశ విదేశాల్లో అల్లు అర్జున్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. పుష్ప 2 సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. దాంతో బన్నీ ఐకాన్ స్టార్ గా మారిపోయాడు. ప్రస్తుతం బన్నీ అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు రాక అనే టైటిల్ ను ఖరారు చేశారు. అలాగే ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు దర్శకుడు అట్లీ. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది.

ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సుమారు రూ.800 కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తోంది. కాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ మూడు, నాలుగు గెటప్స్ లో కనిపించనున్నాడని టాక్ వినిపిస్తుంది. అలాగే దీపికతో పాటు మరికొంతమంది హీరోయిన్స్ కూడా నటిస్తున్నారని తెలుస్తుంది. రాక సినిమాలో దీపికాతోపాటు దీపికా పదుకొణెతో పాటు జాన్వీకపూర్, మృణాల్‌ ఠాకూర్, రష్మికా మందన్నా, భాగ్యశ్రీ బోర్సే వంటి హీరోయిన్లు కూడా ఈ సినిమాలో నటించనున్నారనే ప్రచారం సాగుతోంది.

కాగా ఇప్పుడు మరో ముద్దుగుమ్మ పేరు తెరపైకి వచ్చింది. అల్లు అర్జున్ సినిమా కోసం మలయాళ ముద్దుగుమ్మను రంగంలోకి దింపనున్నారని తెలుస్తుంది. నటి ఫెమినా జార్జ్‌ అల్లు అర్జున్ రాక సినిమాలో నటిస్తుంది. ఈ విషయాన్నీ ఆమె స్వయంగా తెలిపింది. ఇటీవల ఓ సినిమా ఈవెంట్ లో పాల్గొన్న నటి ఫెమినా జార్జ్‌. ‘రాకా’ లాంటి పెద్ద ప్రాజెక్ట్‌లో భాగమవుతానని ఊహించలేదని అన్నారు.. అల్లు అర్జున్ సినిమాలో నటిస్తా అని కలలో కూడా ఊహించలేదు.. అల్లు అర్జున్ నటించిన హ్యాపీ సినిమా నేను మొదట చూసిన మూవీ.. ఇప్పుడు ఆయన సినిమాలో అదికూడా అంత పెద్ద ప్రాజెక్ట్ లో భాగం అవుతున్నందుకు హ్యాపీగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us