Mahesh Babu: మహేష్ బాబు ఇంట్లో కరోనా కలకలం.. నమ్రత అక్కకు కోవిడ్ పాజిటివ్..

దేశంలో మరోసారి కరోనా కల్లోలం సృష్టిస్తోంది. గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన కేసులు.. ఇటీవలి కాలంలో గణనీయంగా

Mahesh Babu: మహేష్ బాబు ఇంట్లో కరోనా కలకలం.. నమ్రత అక్కకు కోవిడ్ పాజిటివ్..
Mahesh Babu

Updated on: Dec 30, 2021 | 5:33 PM

దేశంలో మరోసారి కరోనా కల్లోలం సృష్టిస్తోంది. గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన కేసులు.. ఇటీవలి కాలంలో గణనీయంగా పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ఇటు ప్రభుత్వాలు సైతం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఇక మరోవైపు సెలబ్రెటీలపై ఈ వైరస్ మహామ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే కమల్ హాసన్, కరీనా కపూర్, అర్జున్ కరోనా భారిన పడగా.. ఈరోజు బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి సైతం కోవిడ్ సోకినట్లుగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేసింది.

ఇదిలా ఉంటే.. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. మహేష్ వదిన… నమ్రత అక్క శిల్ప శిరోద్కర్ కరోనా భారిన పడ్డారు. శిల్ప శిరోద్కర్ గతంలో బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. హమ్, ఖుదా గవా, ఆంఖేన్ సినిమాలలో హీరోయిన్‏గా నటించి మెప్పించింది శిల్పా. ప్రస్తుతం శిల్ప శిరోద్కర్ దుబాయ్‏లో నివసిస్తుంది. శిల్పకు.. మహేష్ కుటుంబంతో ఉన్న సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహేష్ ఇంట్లో జరిగే ప్రతి వేడుకలలో శిల్ప కచ్చితంగా ఉంటుంది. ఇక గత నాలుగు రోజులుగా కరోనాతో పోరాడుతున్నట్లుగా శిల్ప తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేసింది. ప్రతి ఒక్కరు సురక్షితంగా ఉండండి. దయచేసి టీకాలు వేసుకోండి. వైరస్ నియంత్రణకు అన్ని నియమాలను అనుసరించండి అంటూ షేర్ చేసింది శిల్ప.

Also Read: Viral Photo: ఈ హీరోయిన్‏కు తెలుగులో ఫుల్ క్రేజ్.. జూనియర్ సౌందర్య అనేస్తుంటారు.. ఎవరో గుర్తుపట్టారా ? ..

Viral Photo: ఈ ఫోటోలోని చిన్నారి.. ఇప్పుడు హీరోయిన్‌గా తెలుగు, తమిళ్‌లో దూసుకుపోతుంది… గుర్తుపట్టారా..?

Sudheer Babu: ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అంటున్న సుధీర్ బాబు.. అందమైన ప్రేమ కథగా రాబోతున్న సినిమా..

Year Ender 2021: ఈ ఏడాది దుమ్మురేపిన మాస్‌ మసాలా సాంగ్స్‌.. ఊ అంటావా అంటూ.. ప్రేక్షకులను ఊపేశాయి..

 

Loading...
Unable to load recommendations.
Follow Us