Mahesh Babu: మనసులోని మాటలను బయటపెట్టిన మహేష్ బాబు.. ఆ సినిమాను రీక్రియేట్ చేయాలనుందంటూ..

|

May 19, 2022 | 9:58 PM

రిలీజ్ అయిన తొలి వారం రోజుల్లోనే రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డ్ సృష్టించింది. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ నటించగా.

Mahesh Babu: మనసులోని మాటలను బయటపెట్టిన మహేష్ బాబు.. ఆ సినిమాను రీక్రియేట్ చేయాలనుందంటూ..
Mahesh Babu
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh babu) ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన ఈ మూవీ మే 12న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. రిలీజ్ అయిన తొలి వారం రోజుల్లోనే రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డ్ సృష్టించింది. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ నటించగా.. కీలకపాత్రలో సముద్రఖని నటించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది సర్కారు వారి పాట సినిమా. తాజాగా మహేష్ తన మనసులోని మాటలను బయటపెట్టారు.. తాను ఓ సినిమా చూసి ఏడ్చేశానంటూ చెప్పుకొచ్చారు.

ఇటీవల ఓ మ్యాగజైన్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను తెలిపారు మహేష్. తనకు నాని అనే నిక్ నేమ్ అంటే చాలా ఇష్టమన్నారని.. అలాగే.. లాక్ డౌన్ సమయంలో లెక్కలేనన్నీ హాలీవుడ్ మూవీస్, వెబ్ సిరీస్ చూశానని.. అందులో లయన్ కింగ్ అనే సినిమా చూసి ఏడ్చినట్లు చెప్పినట్లు తెలుస్తోంది.. అంతేకాకుండా.. తాను ఒకవేళ డైరెక్టర్ అయితే.. ఒక్కడు సినిమాను రీక్రియేట్ చేయాలనుకుంటున్నట్లు చెప్పారట.. ఇక సూపర్ స్టార్ కృష్ణ నటించి అల్లూరి సీతారామ రాజు సినిమా ఫేవరేట్ అని… హాలీ డే ట్రిప్ కు వెళితే ఇష్టమన్నట్లుగా తెలుస్తోంది. మహేష్ ఎక్కువగా బ్యూటీఫుల్ అనే పదాన్ని ఉపయోగిస్తారని.. దర్శకుల అంచనాలను అందుకోలేమోననే భయం తనకు ఎప్పుడూ ఉంటుందని చెప్పినట్లు తెలుస్తోంది.