Krishna: ఆందోళనకరంగా సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం.. వైద్యులు ఏమంటున్నారంటే

గత కొద్దిరోజులుగా కృష్ణ అనారోగ్యానికి గురయ్యారని తెలుస్తుంది. ఆయన శ్వాససంబంధిత సమస్యతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది.

Krishna: ఆందోళనకరంగా సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం.. వైద్యులు ఏమంటున్నారంటే
Krishna

Updated on: Nov 14, 2022 | 1:21 PM

సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. నిన్న కృష్ణ అనారోగ్యానికి గురవ్వడంతో ఆయనను హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పటల్ లో చేర్పించారు కుటుంబసభ్యులు. గత కొద్దిరోజులుగా కృష్ణ అనారోగ్యానికి గురయ్యారని తెలుస్తుంది. ఆయన శ్వాససంబంధిత సమస్యతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కృష్ణ ను ఐసీయూలో ఉంచి చికిత్య అందిస్తున్నారు వైద్యులు. కృష్ణ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు ప్రార్ధనలు చేస్తున్నారు. ఇటీవలే ఆయన మొదటి భార్య ఇందిరా దేవి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆలాగే ఆయన రెండో భార్య విజయ నిర్మల, పెద్ద కుమారుడు రమేష్ బాబు కూడా అనారోగ్యంతో కన్నుమూశారు. ఇక కృష్ణ మిత్రుడు కృష్ణం రాజు కూడా ఇటీవలే కన్నుమూశారు.

ప్రస్తుతం కృష్ణ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. ఇప్పటికే కాంటినెంటల్ హాస్పటల్ కు మహేష్ బాబు సహా ఇతర కుటుంబసభ్యులు చేరుకున్నారు. ఇదిలా ఉంటే వయసు మీదపడటంతో పాటు గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో కృష్ణ బాధపడుతున్నట్టు తెలుస్తోంది. కృష్ణ శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. కాగా కాంటేనంటల్ వైద్యులు మాట్లాడుతూ.. కార్డియాక్ అరెస్ట్ తో వచ్చారు. మధ్య రాత్రి సమయంలో కృష్ణను హాస్పటల్ లో జాయిన్  చేశారు. ప్రస్తుతం ఆయన ఇంటెన్సీవ్ కేర్ లో ఉన్నారు. కొద్దిగా స్టేబుల్ గా ఉన్నారు. 20 మినిట్స్ లో కార్డియాక్ అరెస్ట్ నుండి బయటికి తీసుక వచ్చారు. 24 గంటల అబ్జర్వేషన్ తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చెప్తం అని వైద్యులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us