Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్ పై క్లారిటీ ఇచ్చిన మహేష్.. ఆయన నా దేవుడు అంటూ..

|

May 09, 2022 | 7:13 PM

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే థియేటర్స్ దగ్గర జాతర వాతావరణం నెలకొంటుంది.

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్ పై క్లారిటీ ఇచ్చిన మహేష్.. ఆయన నా దేవుడు అంటూ..
Mahesh Babu
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu)కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే థియేటర్స్ దగ్గర జాతర వాతావరణం నెలకొంటుంది. మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata) సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో అందాల భామ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. మహేష్ తనలోని సరికొత్తకోణాన్ని చూపించనున్న సర్కారు వారి పాట నుంచి ఇప్పటికే అదిరిపోయే పాటలు, గూస్ బంప్స్ తెప్పించే టీజర్.. ఎక్స్పెక్టేషన్స్ ను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లిన ట్రైలర్ ప్రేక్షకుల ముందు వచ్చేశాయి. దాంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని మహేష్ అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే మహేష్ ప్రొడ్యూస్ చేసిన మూవీ మేజర్. యంగ్ హీరో అడవి శేష్ నటిస్తున్న మేజర్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమానుంచి ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ ట్రైలర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు. ఈ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతు ఆసక్తికర కామెంట్స్ చేశారు. మీడియాతో మాట్లాడుతు వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్ చేస్తారా అని ప్రశ్నకు మహేష్ జవాబిస్తూ.. కృష్ణ గారి బయోపిక్ ఎవరైనా తీస్తే మొదటగా నేను చూసి సంతోషిస్తాను. కానీ నేను నాన్న బయోపిక్ తియ్యను ఆయన నా దేవుడు.. అవసరం అయితే ప్రొడ్యూస్ చేస్తాను అని మహేష్ అన్నారు. దాంతో కృష్ణ బయోపిక్ పై క్లారిటీ ఇచ్చేశారు మహేష్. ఇక మేజర్ సినిమా మహేష్ బాబు జీఏంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 3 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

Priyanka Chopra: మదర్స్‌డే రోజున ముద్దుల కూతురి ఫొటోను రివీల్‌ చేసిన చేసిన ప్రియాంక.. ఇన్నాళ్లు పాప ఆస్పత్రిలోనే ఉందంటూ ఎమోషనల్‌..

Kodali Bosubabu: టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నిర్మాత కన్నుమూత..

Director Vishwanath: ఎన్టీఆర్ నటనకు డైరెక్టర్ విశ్వనాధ్‌ ఫిదా.. కొమురం భీముడో సాంగ్‌ చూసి ఎమోషనల్ రిప్లై..