Mansoor Ali Khan : మన్సూర్‌ అలీ ఖాన్‌‌కు మొట్టికాయలు వేసిన కోర్టు.. లక్షరూపాయలు కట్టాలంటూ..

త్రిషతో తనకు సినిమాలో రేప్ సీన్ లేనందుకు బాధపడుతున్నా అని సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు. దాంతో చాలా మంది మన్సూర్‌ అలీ ఖాన్‌ పై మండిపడ్డారు. త్రిష కూడా అతనితో ఇంకెప్పుడూ పని చేయను అని తేల్చి చెప్పేసింది. అలాగే త్రిష పై మన్సూర్‌ అలీ ఖాన్‌ చేసిన కామెంట్స్ పై చాలా మంది ఖండించారు. చిరంజీవి, ఖుష్బూతో పాటు చాలా మందిని మన్సూర్‌ అలీ ఖాన్‌ కామెంట్స్ పై ఫైర్ అయ్యారు. 

Mansoor Ali Khan : మన్సూర్‌ అలీ ఖాన్‌‌కు మొట్టికాయలు వేసిన కోర్టు.. లక్షరూపాయలు కట్టాలంటూ..
Mansoor Ali Khan

Updated on: Dec 22, 2023 | 5:10 PM

మన్సూర్‌ అలీ ఖాన్‌.. ఈ విలన్ ఈ మధ్యకాలంలో చేసిన హడావిడి అంతా ఇంత కాదు. త్రిష పై షాకింగ్ కామెంట్స్ చేసిన మన్సూర్‌ అలీ ఖాన్‌ పెద్ద రచ్చే చేశాడు. త్రిషతో తనకు సినిమాలో రేప్ సీన్ లేనందుకు బాధపడుతున్నా అని సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు. దాంతో చాలా మంది మన్సూర్‌ అలీ ఖాన్‌ పై మండిపడ్డారు. త్రిష కూడా అతనితో ఇంకెప్పుడూ పని చేయను అని తేల్చి చెప్పేసింది. అలాగే త్రిష పై మన్సూర్‌ అలీ ఖాన్‌ చేసిన కామెంట్స్ పై చాలా మంది ఖండించారు. చిరంజీవి, ఖుష్బూతో పాటు చాలా మందిని మన్సూర్‌ అలీ ఖాన్‌ కామెంట్స్ పై ఫైర్ అయ్యారు.

ఇదిలా ఉంటే త్రిషకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు అంటూ రివర్స్ అయ్యాడు. మన్సూర్‌-త్రిష మధ్య వివాదంలో కొత్త ట్విస్ట్‌. త్రిష, ఖుష్బూ, చిరంజీవిపై పరువునష్టం దావా వేస్తానని మన్సూర్‌ ప్రకటించడం కోలివుడ్‌లో సంచలనం రేపుతోంది. తనను మాటలతో హింసించిన వారిపై లాయర్‌తో వెళ్లి కేసు పెడతానని వెల్లడించారు.

చిరంజీవి, లోకేష్‌ కనగరాజ్‌, ఖుష్బు, మాళవిక మోహనన్‌, నితిన్‌, చిన్మయి, సపోర్ట్‌గా నిలిచారు. త్రిషపై మన్సూర్‌ వ్యాఖ్యలను అంతా తీవ్రంగా ఖండించాలని చిరంజీవి ట్వీట్‌ చేశారు. వక్రబుద్ధితో ఇలాంటివి మాట్లాడుతున్నారన్నారు. త్రిషకు మాత్రమే కాదు, ఇలాంటి వ్యాఖ్యలు ఏ అమ్మాయికి వచ్చినా సపోర్ట్‌గా నిలబడతానని ట్వీట్‌ చేశారు చిరంజీవి. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి త్రిష అంశంపై స్పందించడంతో ఈ వివాదం మరింత పెద్దగా మారింది. ఇదిలా ఉంటే మన్సూర్‌ అలీ ఖాన్‌ కు కోర్టు షాక్ ఇచ్చింది.  చిరంజీవి, ఖుష్బూ పై పరువు నష్టం దావా వేశాడు. చెరో కోటిరూపాయలు ఇవ్వాలని కోర్టును ఆశ్రయించాడు. పబ్లిసిటీ కోసం చేసినట్లే ఉందని పిటిషన్ ను కొట్టేసింది కోర్టు. అంతే కాదు సమయం వృథా చేసినందుకుగానూ లక్ష రూపాయలు చెన్నైలోని అడయార్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెల్లించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌ సతీశ్‌ కుమార్‌ మన్సూర్ ను ఆదేశించారు.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.