Actor : హీరోగా సీనియర్ నటుడి మనవడు.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన డైరెక్టర్ పరుచూరి గోపాలకృష్ణ..

తెలుగు సినీరంగంలో విప్లవ కేతనం ఎగరేసిన వ్యక్తి రెడ్ స్టార్ మాదాల రంగారావు. వెండితెరపై విప్లవశంఖం పూరిచి.. యువతరం థియేటర్ల వైపు కదిలేలా చేశారు. నటుడిగానే కాకుండా నిర్మతగా, దర్శకుడిగానూ మెప్పించారు. తెలుగులో ఎర్రమల్లెలు, మహా ప్రస్థానం, విప్లవ శంఖం వంటి చిత్రాలను రూపొందించారు.

Actor : హీరోగా సీనియర్ నటుడి మనవడు.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన డైరెక్టర్ పరుచూరి గోపాలకృష్ణ..
Madala Sunny

Updated on: Feb 04, 2026 | 3:07 PM

శ్రీకరం ప్రొడక్షన్స్ పతాకం పై శ్రీకర్ కృష్ణ స్వయదర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం “ఓ టార్చర్ ప్రేమ”. ఈ చిత్రం లో మాదాల రంగారావు మనవడు మాదాల రవి అబ్బాయి సన్నీ మాదాల హీరోగా, మౌనిక డాకోజు హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. అయితే ఈరోజు ఈ చిత్రం మొదటి టైటిల్ పోస్టర్ ని ప్రముఖ రచయిత, దర్శకుడు డాక్టర్ పరచూరి గోపాల కృష్ణ విడుదల చేసారు. అనంతరం పరచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ “మా మాదాల రంగారావు గారి మనవడు, మాదాల రవి కుమారుడు మూడోతరం హీరో సన్నీ మాదాల హీరో గా పరిచయం అవుతున్నాడు. తాత మార్గం, తండ్రి మార్గం విప్లవం అయితే మూడోతరం హీరో సన్నీ మాదాల ప్రేమ మార్గం ని ఎన్నుకున్నాడు. “ఓ టార్చర్ ప్రేమ” అనే అద్భుతమైన ప్రేమ కథ చిత్రం తో వస్తున్నాడు. రచన దర్శకత్వం అనేది మేము చాలా చిత్రాలకి వహించాము, కానీ దర్శకుడు శ్రీకర్ కృష్ణ మన దాసరి నారాయణ రావు రీతిలో రచన, దర్శకత్వం తో పాటు నిర్మాణం కూడా అందించాడు. ఈ చిత్రం విజయవంతం కావాలి” అని కోరుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి: Jabardasth: పెద్ద హీరో సినిమాలో ఛాన్స్.. మొహం మీదే వద్దని చెప్పా.. జబర్దస్త్ బ్యూటీ..

దర్శకుడు శ్రీకర్ కృష్ణ మాట్లాడుతూ “ఇది ఒక మంచి ప్రేమకథా చిత్రం. ఈ చిత్రం లో నవ్వులు చిందించే సన్నివేశాలతో పాటు ప్రేమలో ఉన్న ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదల చేస్తాం” అని తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి: Uday Kiran : ఆ చెత్త సినిమాలే నా కెరీర్‏ను నాశనం చేశాయి.. ఉదయ్ కిరణ్ ఎమోషనల్ కామెంట్స్..

మాదాల రంగరావు విషయానికి వస్తే.. సినీరంగంలో విప్లవ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో విప్లవశంఖం, యువతరం కదిలింది, ఎర్రమల్లెలు, మహాప్రస్థానం, విప్లవ శంఖం, నవోదయం, ప్రజాశక్తి వంటి విప్లవ చిత్రాలను తెరకెక్కించారు. ఆయన కుమారుడు మాదాల రవి సైతం నటుడే. నేను సైతం, మా ఇలవేల్పు, బ్రోకర్ 2, పంచముఖి వంటి సినిమాల్లో నటించారు. ఇప్పుడు మాదాల రంగరావు మనవడు సైతం ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి: Dhandoraa Movie : దండోరా సినిమాలో బింధు మాధవి పాత్రలో ఆ హీరోయిన్ నటించాల్సింది.. కానీ.. డైరెక్టర్

ఎక్కువ మంది చదివినవి: Cinema : అర్థరాత్రి హోటల్లో అరుపులు.. 24 ఏళ్లుగా ఆ హీ‏రోయిన్‏ను భయపెడుతున్న సినిమా.. ఇప్పటికీ..