Lenin Movie: అందుకే శ్రీలీల ప్లేస్‌లో భాగ్యశ్రీ వచ్చింది.. అసలు విషయం చెప్పేసిన నిర్మాత నాగవంశీ

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'లెనిన్'. విలేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాలో మొదట శ్రీలీలను తీసుకున్నారు. కొంత భాగం షూటింగ్ కూడా చేశారు.. కానీ..

Lenin Movie: అందుకే శ్రీలీల ప్లేస్‌లో భాగ్యశ్రీ వచ్చింది.. అసలు విషయం చెప్పేసిన నిర్మాత నాగవంశీ
Lenin Movie

Updated on: Jul 09, 2026 | 10:27 PM

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘లెనిన్’ చిత్రం విడుదలకు రంగం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో అంటే రేపు (జులై 10న) ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ విలేజ్ లవ్ స్టోరీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పాటలు, గ్లింప్స్, ట్రైలర్ మూవీపై అంచనాలు పెంచేశాయి. ముఖ్యంగా భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానుంది. అయితే లెనిన్ సినిమా మొదలైనప్పుడు మొదట హీరోయిన్‌గా శ్రీలీలను తీసుకున్నారు. కొంత భాగం షూటింగ్ కూడా చేశారు. అఖిల్, శ్రీలీల కలిసున్న పోస్టర్స్ ను కూడా రిలీజ్ చేశారు. అయితే ఏమైందో తెలియదు కానీ శ్రీలీల స్థానంలో భాగ్యశ్రీ బోర్సే వచ్చింది. ఇలా హీరోయిన్ల మార్పుపై అనేక ఊహాగానాలు చెలరేగాయి. అయితే తాజాగా ఈ పుకార్లకు చెక్ పెట్టారు నిర్మాత నాగవంశీ. లెనిన్ సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన ఆయన హీరోయిన్ మార్పు వెనుక అసలు కారణాన్ని వెల్లడించారు.

‘లెనిన్ సినిమా నుంచి శ్రీలీలను తప్పించడం వెనుక ఎలాంటి వివాదాలు లేవు. కేవలం డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్లే ఈ మార్పు జరిగింది. కథకు సంబంధించిన క్రియేటివ్ చర్చల వల్ల మా వైపు నుంచే కొంత ఆలస్యం జరిగింది. మేము షూటింగ్ ప్లాన్ చేసుకునే సమయానికి శ్రీలీల ఇచ్చిన డేట్స్ అందుబాటులో లేవు. ఆ తర్వాత ఆమెకు కార్తీక్ ఆర్యన్ సినిమా, ‘పరాశక్తి’ వంటి పెద్ద ప్రాజెక్టులు వచ్చాయి. మళ్లీ మేము షూటింగ్‌కు సిద్ధమయ్యేసరికి, ఆమె ఆ సినిమాలతో బిజీగా ఉండిపోయింది. దీంతో డేట్స్ క్లాష్ అయ్యాయి. ఆమెను ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేదు. అందుకే ఇరు పక్షాల అంగీకారంతోనే హీరోయిన్‌ను మార్చాల్సి వచ్చింది. ఇందులో శ్రీలీల తప్పేమీ లేదు.అయితే హీరోయిన్ మార్పుతో సినిమాలో కొంత భాగం రీషూట్ చేయాల్సి వచ్చింది. కానీ సినిమా ఫైనల్ కాపీ చూశాక, ఈ పాత్ర భాగ్యశ్రీ కోసమే పుట్టిందా అన్నంత అద్భుతంగా నటించింది’ అని ప్రశంసలు కురిపించారు నాగవంశీ.

ఇవి కూడా చదవండి

బుక్ మై షోలో టాప్ ట్రెండింగ్ లో లెనిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us