Lenin Movie: ‘అయ్యగారే నెంబర్ వన్’.. అఖిల్ వీరాభిమాని స్టోరీ ఏంటో తెలుసా? ‘కల్ట్ ఫ్యాన్’కు సరైన అర్థం

'అయ్యగారి' వీరాభిమానిని గమనిస్తే ఒక విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అతను కేవలం అఖిల్ అక్కినేని సినిమా రిలీజైనప్పుడు మాత్రమే బాగా కనిపిస్తుంటాడు. మిగతా సమయాల్లో అసలు ఎవరికీ కనిపించడు. మరి ఈ వీరాభిమాని ఏం చేస్తుంటాడు? అతని కుటుంబ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం రండి.

Lenin Movie: అయ్యగారే నెంబర్ వన్.. అఖిల్ వీరాభిమాని స్టోరీ ఏంటో తెలుసా? కల్ట్ ఫ్యాన్కు సరైన అర్థం
Akhil Akkineni

Updated on: Jul 12, 2026 | 5:04 PM

అఖిల్ అక్కినేని హీరోగా ఎంట్రీ ఇచ్చి సుమారు పదేళ్లకు పైగానే అవుతోంది. కానీ మొన్నటివరకు ఒక్క సాలిడ్ హిట్ కూడా లేదు. అయితే ఎట్టకేలకు లెనిన్ సినిమాతో ఆ లోటు తీర్చేసుకున్నాడీ అక్కినేని యంగ్ హీరో. జూలై 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. మొదటి రోజు రూ.16 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన లెనిన్ మొత్తం రెండు రోజులకు కలిపి రూ. 37 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. కలెక్షన్ల సంగతి పక్కన పెడితే లెనిన్ సినిమా చాలా మందికి లైఫ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అందులోనూ ముఖ్యంగా హీరో అఖిల్ అక్కినేనికి. అందుకే లెనిన్ సినిమా రిలీజ్ తర్వాత బాగా ఎమోషనల్ అయ్యాడు అఖిల్. తండ్రి నాగార్జున దగ్గర ఆశీర్వాదం తీసుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక అఖిల్ సినిమా సక్సెస్ ను చూసి హీరో నాగార్జున కూడా బాగా సంతోషంలో మునిగితేలుతున్నారు. ఇక అక్కినేని అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే వీరందరి కంటే అఖిల్ అక్కినేని లెనిన్ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకున్నది మాత్రం గుంటూరుకు చెందిన నాగరాజు. ఇతనెవరనుకునేరు.. ‘అయ్యగారే నెంబర్ వన్’ అంటూ సోషల్ మీడియాలో చేసే అఖిల్ వీరాభిమాని ఇతనే.

లెనిన్ సినిమా రిలీజ్ కావడం, సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఈ కల్ట్ ఫ్యాన్ ఇప్పుడు మరోసారి సామాజిక మాధ్యమాల్లో బాగా ట్రెండ్ అవుతున్నాడు. లెనిన్ మూవీ రిలీజ్ సందర్భంగా నాగరాజు థియేటర్ కు వచ్చి సినిమా సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా అఖిల్ కూడా ఈ వీడియోను చూసి మురిసిపోయాడు. ఇక గతంలోనూ తన వీరాభిమానిపై స్పందించిన అఖిల్.. కచ్చితంగా నాగరాజును కలుస్తానని కూడా చెప్పాడు.

ఇవి కూడా చదవండి

లెనిన్ సినిమా రిలీజ్ టైమ్ లో అయ్యగారి వీరాభిమాని..

ఇక నాగరాజు విషయానికి వస్తే.. ఇతనిది గుంటూరు. రోడ్డుపై పండ్ల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే.. నాగరాజు కేవలం అఖిల్ సినిమా రిలీజైనప్పుడు మాత్రమే కనిపిస్తాడు. మిగతా సమయాల్లో పెద్దగా కనిపించడు. సోషల్ మీడియాలోనూ సందడి ఉండదు. అదేంటంటే.. అఖిల్ సినిమా రిలీజైనప్పుడు తప్ప మిగతా సమయాల్లో పండ్ల వ్యాపారం పనిలోనే నిమగ్నమై ఉంటాడు నాగరాజు. సోషల్ మీడియాలో ఇతనికున్న గుర్తింపుతో చాలా సులభంగా డబ్బు సంపాదించుకునే అవకాశముంది. కానీ నాగరాజుకు మాత్రం అలాంటి ఆశలేమీ లేవు. ఒక సాధారణ అభిమానిగానే ఉండడానికి అతను ఇష్టపడుతున్నాడు.

తన కల్ట్ ఫ్యాన్ సెలబ్రేషన్స్ ను మొబైల్ లో చూస్తోన్న అఖిల్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us