Lavanya Tripathi: ఆ ఒక్క సినిమా ఒప్పుకుని ఉంటే.. లావణ్య ఇప్పటికే పాన్‌ ఇండియా స్టార్ అయిపోయేది..

కానీ అదే లక్ మనతో లేకపోతే.. మన తరువాత వచ్చిన వాళ్లు కూడా.. మన ముందే ఇండస్ట్రీలో ఎదుగుతారు. మన కంటే గొప్ప స్టార్లై కూర్చుంటారు. అయితే ఇలాంటి సిట్యూవేషనే

Lavanya Tripathi: ఆ ఒక్క సినిమా ఒప్పుకుని ఉంటే.. లావణ్య ఇప్పటికే పాన్‌ ఇండియా స్టార్ అయిపోయేది..
Lavanya Tripathi

Updated on: Jul 11, 2022 | 3:47 PM

ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ కావాలంటే… ట్యాలెంట్‌ ఒక్కటే కాదు.. దాంతో పాటు లక్కు కూడా ఉండాలి. ఇంకాస్త ఓపెన్‌గా చెప్పాలంటే.. ట్యాలెంట్ కంటే లక్కే ఎక్కువ పాళ్లు ఉండాలి. అప్పుడే సినిమా ఆఫర్లు క్యూ కడతాయి. మేకర్స్‌ మన వెనుక పడతారు. అభిమానులందరూ మన చుట్టూ తిరుగుతారు. కానీ అదే లక్ మనతో లేకపోతే.. మన తరువాత వచ్చిన వాళ్లు కూడా.. మన ముందే ఇండస్ట్రీలో ఎదుగుతారు. మన కంటే గొప్ప స్టార్లై కూర్చుంటారు. అయితే ఇలాంటి సిట్యూవేషనే హీరోయిన్ లావణ్య త్రిపాఠి (lavanya tripathi) విషయంలో జరిగిందనేది ఎట్ ప్రజెంట్ వైరల్ టాక్. ఈ బ్యూటీ కాస్త కాషియస్‌గా ఉంటే.. ఇప్పటికే పాన్ ఇండియా హీరోయిన్ అయిపోదనేది.. ఆమె ఫ్యాన్స్ నోటి నుంచి వస్తున్న మరో టాక్.

ఎప్పుడో 2012లో ‘అందాల రాక్షసి’ సినిమాతో టాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి.. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టార్ హీరోయిన్ అయ్యేందుకు తెగ ట్రై చేస్తూనే ఉన్నారు. ట్రై చేయడమే కాదు.. తనకు వచ్చిన సినిమాల్లో మాక్జిమమ్‌ పర్ఫార్మ్ చేస్తూ.. అటు స్టార్ మేకర్స్ ను ఇటు ఫిల్మ్ లవర్స్‌ ఫిదా చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కాని అప్‌టూది మార్క్‌ కాకుండా… ఏదో చిన్నా చితక హిట్లతో ఆఫర్లైతే పట్టేస్తున్నారు.. స్టార్ హోదాకు మాత్రం ఆమడదూరంలోనే నిలిచిపోతున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే ఆ ఒక్క సినిమానే చేసుంటే తను ఇప్పటికే స్టార్ అయిపోయి ఉండేదాన్ని అని తాజాగా ఓ ఇంటర్య్వూ లో రివీల్ చేశారు లావణ్య. పరుశురామ్ (Parasuram) డైరెక్షన్లో.. విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా తెరకెక్కిన ‘గీతా గోవిదం’ (Geetha Govindam) సినిమాలో తనే హీరోయిన్ అనే విషయాన్ని చెప్పి అందర్నీ షాక్ చేశారు. అయితే అప్పుడు డేట్స్ అడ్జెట్ కాకపోవడంతో.. ఆ సినిమా నుంచి తప్పుకున్నానని.. దాంతో పరుశురామ్ అండ్‌ టీం.. రష్మిక (Rashmika Mandanna) ను తీసుకున్నారని అన్నారు. ఆ ఒక్క విషయంలోనే తాను కాస్త ఫీలయ్యానని చెప్పారు లావణ్య. తప్పితే తన కెరీర్‌ విషయంలో హ్యాపీ అంటూ .. ఓ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అయితే లావణ్య మాట్లాడిన ఇవే మాటలను కోట్‌ చేస్తూ.. లక్కు లేకుంటే ఇలానే అవుందని నెట్టింట కామెంట్ చేస్తున్నారు లావణ్య ఫ్యాన్స్ . మరేం పర్లేదు ఫ్యూచర్లో మరిన్ని మంచి సినిమాలు మీకొస్తాయి అంటూ.. సపోర్ట్ కూడా చేస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us