
రాజ్ తరుణ్, లావణ్య మధ్య వివాదం రోజు రోజుకీ ముదురుతుంది. కొన్నాళ్లు సైలెంట్ అయిన వీరి గొడవ ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా రంగారెడ్డి జిల్లా నార్సింగి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు లావణ్య. రాజ్‌తరుణ్ తల్లిదండ్రులకు సంబంధించిన వ్యక్తులు తనపై దాడి చేశారని తన ఫిర్యాదులో లావణ్య ఆరోపించారు. రాజ్‌తరుణ్ కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణహాని ఉందన్న లావణ్య.. రక్షణ కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు లావణ్య ఇంటి దగ్గర నిన్న అర్ధరాత్రి వరకూ హైడ్రామా కొనసాగింది. కోకాపేట్‌లోని విల్లా రాజ్‌తరుణ్‌దేనంటూ..అతడి తల్లిదండ్రులు నిన్నంతా ఆ ఇంటిముందు నిరసన చేశారు. తమ కుమారుడి ఇంట్లోనే ఉంటామంటూ లావణ్యతో గొడవకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన నార్సింగి పోలీసులు.. రాజ్‌తరుణ్ పేరెంట్స్‌ను ఇంట్లోకి అనుమతించాలని లావణ్యకు స్పష్టం చేశారు. దీంతో గత అర్ధరాత్రి వారిని ఇంట్లోకి అనుమతించారు లావణ్య.
ప్రస్తుతం లావణ్య ఉంటోన్న ఇల్లు తమదేనంటూ బుధవారం రాజ్ పేరెంట్స్ లగేజ్‌తో సహా వెళ్లడంతో ఉద్రిక్త నెలకొంది. తమను ఇంట్లోకి అనుమతించడం లేదని రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ఈ క్రమంలోనే లావణ్య, రాజ్ పేరెంట్స్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఇష్యూపై నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది లావణ్య. రాజ్‌తరుణ్ తల్లిదండ్రులు తనపై దాడి చేశారని ఆరోపించింది. తాను 15 ఏళ్లుగా ఉంటున్న ఇంట్లోకి రాజ్ తరుణ్ పేరెంట్స్ పదిహేను మందితో వచ్చి ఇంటిని ధ్వంసం చేసారని చెబుతోంది. బ్యాట్ తీసుకొని తన తమ్ముడిని కొట్టారని, తలుపులు పగలగొట్టి ఇంట్లోకి రావడానికి ప్రయత్నం చేశారని ఆరోపించింది లావణ్య.
రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని లావణ్య గతంలో చేసిన ఆరోపణలతో మొదలైన వివాదంపై ఎపిసోడ్‌ల మీద ఎపిసోడ్‌లు నడిచాయి. కొన్నాళ్లు అనేక ట్విస్టులతో పెద్ద రచ్చ జరిగింది. ఇటీవల రాజ్ తరుణ్‌కు క్షమాపణ చెబుతూ.. అతడిపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకుంటాని లావణ్య చెప్పింది. ఇక రాజ్ తరుణ్, లావణ్య వివాదానికి ఫుల్ స్టాప్ పడిందని భావిస్తున్న క్రమంలో ఈ గొడవ జరిగింది. లావణ్య ప్రస్తుతం కోకాపేట్ లోని ఓ ఇంట్లోనే ఉంటుంది. రాజ్ తరుణ్, లావణ్య మధ్య గొడవ జరుగుతున్న టైమ్‌లో కూడా ఆమె ఆ ఇంట్లోనే ఉంది. రాజ్ తరుణ్ పేరెంట్స్ ఆ ఇల్లు తమదని ఎంట్రీ ఇవ్వడంతో మళ్లీ రచ్చ రాజుకుంది.