ఆ ఇద్దరూ నాకు విలన్లుగా నటించారు.. ఇప్పుడు పెద్ద హీరోలు అయ్యారు

ఒకప్పుడు తెలుగు సినిమా ప్రపంచంలో నటుడిగా ప్రేక్షకులను అలరించారు నటుడు జి.వి నారాయణ రావు. 1976లో అంతులేని కథ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. సహాయ నటుడిగా తనదైన ముద్ర వేశారు .

ఆ ఇద్దరూ నాకు విలన్లుగా నటించారు.. ఇప్పుడు పెద్ద హీరోలు అయ్యారు
Gv Narayana Rao

Updated on: Aug 31, 2026 | 6:10 AM

సీనియర్ నటుడు జీవీ నారాయణరావు ఇటీవలే కన్నుమూశారు. ఆయన మరణం సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు. గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లోని ఆసక్తికరమైన విషయాలను, మెగాస్టార్ చిరంజీవి, రజినీకాంత్ వంటి అగ్ర తారలతో తనకున్న అనుబంధాన్ని, అలాగే కళాత్మక చిత్రాల పట్ల తనకున్న అంకితభావాన్ని ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆయన హీరోగా నటించిన సమయంలో, రజినీకాంత్, చిరంజీవి విలన్‌లుగా చేశారని వెల్లడించారు. ఈ విషయం ఈ తరం ప్రేక్షకులకు తెలియదని, వారిద్దరూ విలన్ పాత్రల నుంచే తమ కెరీర్‌ను ప్రారంభించారని నారాయణరావు స్పష్టం చేశారు. మోహన్ బాబు వంటి ఇతర నటులు కూడా ఇలాగే మొదలుపెట్టారని గుర్తు చేశారు.

ఆ హీరో అర్ధరాత్రి అడవి మధ్యలో నాకు నాటుకోడి కావాలి అని అడిగాడు.. నేను షాక్ అయ్యా

రజినీకాంత్‌తో తన అనుబంధం గురించి మాట్లాడుతూ, ఇద్దరూ ఒకే రోజు ఇండస్ట్రీకి వచ్చారని, అంతులేని కథ చిత్రంతో కలిసి అరంగేట్రం చేశామని తెలిపారు. ఆ తర్వాత చిలకమ్మ చెప్పింది చిత్రంలో కూడా రజినీకాంత్‌తో నటించానని పేర్కొన్నారు. చిరంజీవితో కుక్కకాటుకి చెప్పు దెబ్బ చిత్రంలో మొదటిసారి కలిసి నటించినట్లు, ఆ చిత్రంలో చిరంజీవి విలన్‌గా కీలక పాత్ర పోషించినట్లు వెల్లడించారు. చిరంజీవితో తాను రూమ్‌మేట్స్‌గా ఉన్నానని, వారితో చాలా సాన్నిహిత్యం ఉందని తెలిపారు.

అతను చాలా మంచి మనిషి..! అంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ నన్ను చూసి లేచి నిలబడతాడు..

ఆ తర్వాత, జీవీ నారాయణరావు లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్) గారితో మూడు సూపర్ హిట్ చిత్రాలలో నటించడం తన అదృష్టంగా భావించారు. ఆలు మగలులో ఆయన కొడుకుగా, బహుదూర బాటసారిలో అల్లుడిగా, సీతారామయ్యగారి మనవరాలులో అల్లుడిగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. ఈ మూడు సినిమాలు సిల్వర్ జూబ్లీలు జరుపుకున్నాయని తెలిపారు. తక్కువ సినిమాలు చేసినప్పటికీ, తన కెరీర్‌లో ఎక్కువ హిట్లు ఉన్నాయని ఆయన సంతోషంగా చెప్పారు.

ఇవి కూడా చదవండి

16 ఏళ్లకే ఎంట్రీ 26ఏళ్లకే కెరీర్ క్లోజ్..! పెళ్ళైన 15 రోజులకే పారిపోయిన భర్త..!! ఈ హీరోయిన్ లైఫ్ లో సినిమాకు మించిన ట్విస్ట్‌లు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us