Mahesh Babu: నిజ జీవిత సంఘటన ఆధారంగా రాబోతున్న మహేష్- రాజమౌళి సినిమా ?..

|

Oct 17, 2022 | 7:04 PM

రచయిత కెవి విజయేంద్ర ప్రసాద్ మహేష్, రాజమౌళి సినిమా పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. 

Mahesh Babu: నిజ జీవిత సంఘటన ఆధారంగా రాబోతున్న మహేష్- రాజమౌళి సినిమా ?..
Mahesh Babu, Rajamouli
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబు.. దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో రాబోయే సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్ తో జక్కన్న చేయబోయే సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు.. ఈ సినిమా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఉండనుందని… ఇప్పటివరకు జక్కన్న తెరకెక్కించిన చిత్రాలకు మించి ఉంటుందని స్వయంగా రాజమౌళి చెప్పడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. అయితే కొద్దిరోజులుగా ఈ మూవీకి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ నెట్టింట వైరలయ్యాయి. తాజాగా ఇప్పుడు మరో ఆసక్తికర విషయంపై తెరపైకి వచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న రచయిత కెవి విజయేంద్ర ప్రసాద్ మహేష్, రాజమౌళి సినిమా పై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఈ సినిమా రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఆధారంగా రాబోతుందని అన్నారు. ఇదోక అడ్వెంచర్ స్టోరీ అని.. వచ్చే ఏడాది ప్రారంభం కాబోతుందని తెలిపారు. దీంతో ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. అలాగే ఇటీవల టోరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్న జక్కన్న కూడా తాను మహేష్ బాబుతో తీయబోయే సినిమా గురించి పెదవి విప్పారు.

మహేష్ తో తాను తీసే సినిమా జేమ్స్ బాండ్, ఇండియానా జోన్స్ తరహాలో అడ్వంచరస్ గా ఉంటుందని తెలిపారు. ఇక ప్రస్తుతం మహేష్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కంప్లీట్ కాగానే… జక్కన్న మహేష్ ప్రాజెక్ట్ ప్రారంభంకాబోతుంది.