Krithi Shetty: వరుస అవకాశాలతో దూసుకెళుతోన్న ‘ఉప్పెన’ భామ.. అక్కినేని హీరోతో జతకట్టనున్న బ్యూటీ..?

|

Feb 08, 2021 | 8:57 PM

Krithi Shetty Got Chance With Akhil: ‘ఉప్పెన’ ప్రీరిలీజ్ ఈవెంట్ కార్యక్రమంలో చాలా మంది అతిథులు చెప్పిన మాట... ఈ సినిమాలో హీరోయి‌న్‌గా నటించిన కృతి శెట్టి చాలా బాగా నటించింది, రానున్న రోజుల్లో ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీని ఏలుతుంది. చివరికి..

Krithi Shetty: వరుస అవకాశాలతో దూసుకెళుతోన్న ‘ఉప్పెన’ భామ.. అక్కినేని హీరోతో జతకట్టనున్న బ్యూటీ..?
Follow us on

Krithi Shetty Got Chance With Akhil: ‘ఉప్పెన’ ప్రీరిలీజ్ ఈవెంట్ కార్యక్రమంలో చాలా మంది అతిథులు చెప్పిన మాటలు… ‘ఈ సినిమాలో హీరోయి‌న్‌గా నటించిన కృతి శెట్టి చాలా బాగా నటించింది, రానున్న రోజుల్లో ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీని ఏలుతుంది’. చివరికి మెగాస్టార్ చిరంజీవి ఓ అడుగు ముందుకేసి.. ‘దర్శకనిర్మాతలు ఇప్పుడే ఈ అమ్మాయి డేట్‌లను బుక్ చేసుకోండి ఎందుకంటే, భవిష్యత్తులో దొరక్క పోవచ్చు’ అని కామెంట్ చేశాడంటేనే ఈ బ్యూటీ ఏ స్థాయిలో నటించిందో అర్థం చేసుకోవచ్చు.
వీరందరి మాటలు నిజం చేస్తూ కృతి శెట్టి నిజంగానే ఆ దిశలో ప్రయాణిస్తోంది. ఇంకా మొదటి సినిమా విడుదల కాకముందే వరుస అవకాశాలను సొంతం చేసుకుంటోంది. ఈ క్రమంలో ఇప్పటికే నాని హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో నటించే చాన్స్ కొట్టేసిన ఈ బ్యూటీ.. తాజాగా మరో యంగ్ హీరోతో నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ బ్యూటీ అక్కినేని నట వారసుడు అఖిల్‌తో నటించనుందని తెలుస్తోంది. అంతేకాకుండా నాగశౌర్య హీరోగా రాబోయే ఓ చిత్రంలో ఈ భామను హీరోయిన్‌గా తీసుకోనున్నారని తెలుస్తోంది. ఇలా ఇంకా ఒక్క సినిమా కూడా విడుదలకాక ముందే వరుస అవకాశాలతో దూసుకెళుతోన్న కృతి ఎలాంటి విజయాలను అందుకుంటుందో వేచి చూడాలి.

Also Read: Rashmika Mandanna: తొలిసారి ప్రైవేట్ ఆల్బమ్‌లో తళుక్కుమన్న రష్మిక.. దేశీ లుక్‌లో అదరగొట్టిన గీతా మేడమ్..