క్షణం సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. థ్రిల్లర్ జోనర్‌లో సైలెంట్‌గా వచ్చి బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. ఆ సినిమాకు తెలుగు సినిమా ప్రముఖులు ఎంతోమంది ప్రశంసలు ఇచ్చారు. ఈ మూవీ స్క్రిప్ట్ విషయంలో అడవి శేష్ కీలక పాత్ర పోషించినప్పటికి..డైరెక్టర్ రవికాంత్ పేరపు మేకింగ్‌కి కూడా మంచి పేరు వచ్చింది. అయితే ఆ తర్వాత ఈ దర్శకుడు పత్తా లేకుండా పోయాడు. క్షణం రిలీజైన నాలుగేళ్లు తర్వాత “కృష్ణ అండ్ హిస్ లీల” మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు రవికాంత్. అది కూడా సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో మంచి రొమాంటిక్ కథను లైన్లో పెట్టాడు. ఈ మూవీ టీజర్ రీసెంట్‌గా రిలీజయ్యింది.
ఇందులో గుంటూరు టాకీస్ మూవీ ఫేమ్ సిద్దు హీరోగా నటించాడు. మొదటి చిత్రంతో ఆడియెన్స్ థ్రిల్‌కి గురిచేసిన దర్శకుడు రవికాంత్..ఈ సారి కాస్త అడల్డ్ కంటెంట్ చిత్రంపై ఫోకస్ పెట్టినట్టు అర్థమవుతోంది. లైఫ్ అంతా రాంగ్ టైమ్‌లో రిలేషన్ ఉంటాను అంటూ హీరోతో తనకున్న బలహీనతను చెప్పించారు. బ్యాగ్రౌండ్లో హేమ చంద్ర పాటిన పులిహోర పాట టీజర్ మొత్తానికి హైలెట్‌గా నిలిచింది. విజువల్స్ అన్ని గ్రాండియర్‌గా ఉన్నాయి. శ్రద్ధా శ్రీనాథ్ .. షాలిని .. శీరత్ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్స్‌గా నటించారు. ముగ్గురు ముద్దుగుమ్మలతో..హీరో నడిపే ప్రేమాయణం మెయిన్ థీమ్‌గా టీజర్ అయితే యూత్‌ను ఆకట్టకుంటుంది. మే 1వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.