గత రెండేళ్లుగా తెలుగు తెరపై పరభాష ముద్దుగుమ్మలు సందడి చేస్తున్నారు. ఇటీవల యంగ్ హీరోయిన్స్ హడావిడి ఏరేంజ్ లో ఉందో చెప్పక్కర్లేదు. ముఖ్యంగా దక్షిణాది భామలు చాలా మంది వచ్చారు. ఇంకా వస్తూనే ఉన్నారు.

అందులో అదృష్టం ఉన్నవారు హీరోయిన్లుగా చక్రం తిప్పుతున్నారు. ఇక మరికొందరు ఒకటి రెండు సినిమాలతో సైడ్ అవ్వగా.. మరికొందరు వరుస సినిమాలు చేస్తున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా వరుస ప్రాజెక్ట్స్ చేస్తున్నారు.

ఇక ఇప్పుడు తెలుగు తెరకు మరో తమిళ్ సోయగం పరిచయం కానుంది. ఆ ముద్దుగుమ్మ పేరే అతుల్య రవి. 2017లోనే ఈ అమ్మడు.. తమిళ్ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యింది. అప్పటి నుంచి వరుస సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది.

ఇంకా అక్కడ సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది. ఈ క్రమంలోనే మీటర్ సినిమాతో ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంది. రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం హీరోగా నటించారు.

మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా రేపు (ఏప్రిల్ 7) థియేటర్లలో రిలీజ్ కానుంది. గ్లామర్ పరంగా అతుల్య రవికి వంక బెట్టాల్సిన అవసరం లేదు. మరీ నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా ?లేదా ? అనేది చూడాలి.

ఇప్పటివరకు ఇంటర్వ్యూలలో పాల్గొన్న ఆమె.. తెలుగు స్పష్టంగా మాట్లాడుతూ షాకిచ్చింది. ఇక మీటర్ హిట్ కొడితే ఈ బ్యూటీకి గట్టిగానే ఆఫర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరీ మీటర్ సినిమాతో ఈ బ్యూటీ హిట్ అందుకుంటుందేమో చూడాలి. అటు కిరణ్ అబ్బవరంకు కూడా ఈ సినిమా బ్రేక్ ఇస్తుందేమో తెలియాలి.

ఆ యంగ్ హీరో సినిమాపై కోలీవుడ్ బ్యూటీ ఆశలన్నీ.. ఈసారి అతుల్య రవి అదృష్టం వరించేనా ?..