
టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ హీరో వెంకటేశ్. దివంగత నిర్మాత రామానాయుడు తనయుడిగా కలియుగ పాండవులు సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. అయితే వెంకీ కెరీర్ లో ఎంతో మంది కొత్త హీరోయిన్లను తెలుగు తెరకు పరిచయం చేశారు. అంతేకాదు వాళ్లంతా తోపు హీరోయిన్లు కావడం గమనార్హం. తొలి చిత్రంతోనే కుష్బూను కథానాయికగా పరిచయం చేశారు. ఆ తర్వాత చాలా మంది హీరోయిన్లను కెమెరా ముందుకు తీసుకొచ్చారు. కలియుగ పాండవులు సినిమా సూపర్ హిట్ అయ్యింది. మొదటి చిత్రంతోనే అందం, అభినయంతో కట్టిపడేసింది కుష్బూ. తెలుగుతోపాటు తమిళంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘బొబ్బిలి రాజా’ సినిమాతో దివ్యభారతిని తెలుగు తెరకు పరిచయం చేశారు. ఆ తర్వాత ఆమె పాన్ ఇండియా లెవల్లో వరుస సినిమాలతో ఓ వెలుగు వెలిగింది.
ఎక్కువ మంది చదివినవి : Sekhar Kammula : ఆ సినిమా తీసి తప్పు చేశాను.. అది ఒక పొరపాటు మాత్రమే.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కామెంట్స్..
విక్రమ్ సినిమాతో కథానాయికగా టబు అక్క ఫరాను తెలుగు తెరకు పరిచయం చేశారు. ఆ తర్వాత ఆమె తెలుగులో కాకుండా హిందీలో వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. కూలీ నెం. 1 సినిమాతో టబును హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం చేశారు. తెలుగు, హిందీ, తమిళంలో వరుస సినిమాలతో సత్తా చాటింది. ‘సుందరకాండ’ సినిమాతో అపర్ణను పరిచయం చేశారు. ఈ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ అంతగా సక్సెస్ కాలేదు. ‘ధర్మచక్రం’ సినిమాతో హీరోయిన్ ప్రేమను తెలుగు తెరకు పరిచయం చేశారు.
ఎక్కువ మంది చదివినవి : Gopichand : జయం సినిమాకు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ అంతే.. ఎలా ఖర్చు చేశానంటే.. గోపిచంద్ కామెంట్స్..
వెంకటేష్ హీరోగా వచ్చిన సాహసవీరుడు సాగరకన్య సినిమాతో శిల్పాశెట్టి టాలీవుడ్ ఇండస్ట్రీకి తీసుకువచ్చారు. బాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాతో వినీతను పరిచయం చేశారు. ‘ప్రేమించుకుందాం రా’ సినిమాతో అంజలా ఝవేరి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి తీసుకువచ్చారు. ప్రేమంటే ఇదేరా సినిమాతో ప్రీతి జింతా తెలుగు అడియన్స్ ముందుకు వచ్చారు. ‘శీను’ సినిమాతో ట్వింకిల్ ఖన్నా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు. నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో ఆర్తి అగర్వాల్ , ‘మల్లీశ్వరి’ సినిమాతో కత్రినా కైఫ్ వంటి హీరోయిన్లను తెలుగు తెరకు పరిచయం చేశారు. లక్ష్మీ’ సినిమాతో నయనతార టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ‘గురు’ సినిమాతో రితికా సింగ్ తెలుగు తెరకు పరిచయం అయ్యింది. వీళ్లంతా ఇతర భాషలలో అగ్ర కథానాయికలుగా సత్తా చాటారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : రూ.5 వేలకు స్కూల్లో టీచర్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యునరేషన్.. పాన్ ఇండియా గ్లామరస్ హీరోయిన్..
ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi : రమ్య కృష్ణతో ప్రేమ, పెళ్లికి ఆ పాటనే కారణం.. డైరెక్టర్ కృష్ణ వంశీ..