
జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు కెరీర్లను పూర్తిగా నాశనం చేస్తాయి. నచ్చిన రంగంలో దూసుకుపోతున్న సమయంలోనే.. అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడే చాలా మంది అనుకోకుండా పలు కేసులలో చిక్కుకుంటారు. కానీ వారి నిరంతర విశ్వాసం, పోరాట స్పూర్తి వారికి మంచి గుర్తింపు తెచ్చిపెడతాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ క్రికెటర్.. మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో చిక్కుకుని తీహార్ జైలుకు వెళ్లాడు. ఆ తర్వాత క్రికెటర్ ప్రయాణం ముగించి నటుడిగా మారాడు. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా, విలన్ గా దూసుకుపోతున్నాడు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ? మనం మాట్లాడుకుంటున్న నటుడి పేరు శ్రీశాంత్.
ఎక్కువ మంది చదివినవి: Jabardasth: పెద్ద హీరో సినిమాలో ఛాన్స్.. మొహం మీదే వద్దని చెప్పా.. జబర్దస్త్ బ్యూటీ..
శ్రీశాంత్ 2005 నుండి 2011 వరకు భారత క్రికెట్ జట్టు తరపున ఆడాడు. అతను ఐపీఎల్‌లో పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడాడు. ఐపీఎల్ సమయంలో స్పాట్ ఫిక్సింగ్‌లో పాల్గొన్నాడనే ఆరోపణలపై 2013లో అతన్ని అరెస్టు చేశారు. ముంబైలో ఢిల్లీ పోలీసులు అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపారు. అతడు తీహార్ జైలులో 27 రోజులు గడిపాడు. ఈ సంఘటన అతని జీవితాన్ని పూర్తిగా తలకిందులు చేసింది. ఆ 27 రోజులు అతడి జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. స్పాట్ ఫిక్సింగ్ కేసు తర్వాత అతడు మల్లీ టీమిండియా తరుపున ఆడలేకపోవచ్చని తన భార్యకు చెప్పానని గుర్తుచేసుకున్నాడు. ఆ సమయంలో అతడికి తన కుటుంబం ఎంతో మద్దతు ఇచ్చింది.
ఎక్కువ మంది చదివినవి: Uday Kiran : ఆ చెత్త సినిమాలే నా కెరీర్‌ను నాశనం చేశాయి.. ఉదయ్ కిరణ్ ఎమోషనల్ కామెంట్స్..
స్పాట్ ఫిక్సింగ్ కేసు నుంచి బయటకు వచ్చిన తర్వాత అతడు కొన్ని స్థానిక క్రికెట్ మ్యాచ్ లు ఆడాడు. ఆ తర్వాత 2017లో విడుదలైన అక్షర్ 2 చిత్రంలో నటుడిగా తెరంగేట్రం చేశారు. కన్నడ చిత్రం కెంపిగౌడ 2కి ఉత్తమ విలన్ నటుడిగా సంతోష్ అవార్డ్ గెలుచుకున్నారు. 2022లో సమంత, నయనతార, విజయ్ సేతుపతి నటించిన కాతు వాకులా రెండు కాదల్ చిత్రంలో ముఖ్య పాత్రలో కనిపించాడు.
ఎక్కువ మంది చదివినవి: Dhandoraa Movie : దండోరా సినిమాలో బింధు మాధవి పాత్రలో ఆ హీరోయిన్ నటించాల్సింది.. కానీ.. డైరెక్టర్
ఎక్కువ మంది చదివినవి: Cinema : అర్థరాత్రి హోటల్లో అరుపులు.. 24 ఏళ్లుగా ఆ హీరోయిన్ను భయపెడుతున్న సినిమా.. ఇప్పటికీ..