Cinema : బ్లాక్ బస్టర్ అంటే ఇది.. రూ. 4 కోట్ల బడ్జెట్… రూ. 73 కోట్ల కలెక్షన్స్.. 11 ఏళ్లైనా తగ్గని క్రేజ్..

ఇటీవల చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాయి. ఎలాంటి అంచనాలు, హడావిడి లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమాలు చాలా ఉన్నాయి. కానీ కేవలం 4 కోట్లతో తెరకెక్కించిన ఓ సినిమా ఏకంగా రూ.73 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అంతేకాదు.. ఆ మూవీ సాయి పల్లవి జీవితాన్ని మలుపు తిప్పింది.

Cinema : బ్లాక్ బస్టర్ అంటే ఇది.. రూ. 4 కోట్ల బడ్జెట్... రూ. 73 కోట్ల కలెక్షన్స్.. 11 ఏళ్లైనా తగ్గని క్రేజ్..
Premam Movie

Updated on: Feb 18, 2026 | 8:55 AM

భారతీయ సినిమా ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన హీరోయిన్ సాయి పల్లవి. పాన్ ఇండియా లెవల్లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తక్కువ సమయంలోనే కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకుంది. విభిన్న కంటెంట్, నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ప్రేక్షకుల మనసులలో తనకంటూ ప్రత్యేక స్థానం సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం భాషలలో అనేక హిట్స్ చేసిన సాయి పల్లవి ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంది. ఇదిలా ఉంటే.. ఆమె కెరీర్ మలుపు తిప్పిన సినిమా గురించి మీకు తెలుసా.. ? 2015లో విడుదలైన ఆ చిత్రం సంచలనాన్ని సృష్టించింది. అంతేకాదు ఆ చిత్రం చెన్నైలో దాదాపు 300 రోజులు థియేటర్లలో ఆడిన ఏకైక మూవీ. ఈ చిత్రం విడుదలై 11 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు.

ఎక్కువ మంది చదివినవి :  Actress Prathyusha : స్టార్ హీరోలతో సినిమాలు.. కెరీర్ పీక్స్‏లో సూసైడ్.. హీరోయిన్ ప్రత్యూష ఎలా చనిపోయిం

తమిళ సినీ అభిమానులు జరుపుకునే మలయాళ చిత్ర పరిశ్రమ గతిని మార్చిన చిత్రం ‘ప్రేమమ్’. 2015లో విడుదలైన అల్ఫోన్స్ పుతిరన్ దర్శకత్వం వహించిన ‘ప్రేమమ్’ బలం దాని సరళమైన కానీ వాస్తవిక కథ చెప్పడం. ఈ చిత్రం జార్జ్ (నివిన్ పౌలీ) అనే యువకుడి జీవితంలో మూడు వేర్వేరు కాలాల్లో వచ్చే ప్రేమను వివరిస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : Actress Pratyusha : హీరోయిన్ ప్రత్యూష మృతి కేసు.. వెంటనే లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశం..

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు ‘ప్రేమమ్’. 2015లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. అల్ఫోన్స్ పుతిరన్ దర్శకత్వం వహించిన ‘ప్రేమమ్’ ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ కలిగి ఉంది. ఈ చిత్రం జార్జ్ (నివిన్ పౌలీ) అనే యువకుడి జీవితంలో మూడు వేర్వేరు కాలాల్లో వచ్చే ప్రేమను వివరిస్తుంది. టీనేజ్ సంవత్సరాల్లో జరిగిన అందమైన, అమాయకమైన మొదటి ప్రేమ. యుక్తవయస్సులో ఎదురయ్యే ప్రేమ.. చివరకు జీవితంపై మెచురిటీ వచ్చిన తర్వాత అసలైన ప్రేమను తెలియజేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది.

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా సినిమా.. ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసింది.. నిర్మాత కామెంట్స్..

ఇందులో నివిన్ పౌలీ, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంతోనే సాయి పల్లవి నటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఫిదా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కేవలం రూ.4 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం రూ.73 కోట్లు వసూలు చేసి, ఆ కాలంలో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

ఎక్కువ మంది చదివినవి : Folk Song : ఏం క్రేజ్ రా మావా.. 35 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ షేక్.. దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్..

Follow Us