Tollywood : రొమాంటిక్ చిత్రాలకు రారాజు.. ఇప్పుడు తెలుగులో తోపు విలన్.. లైఫ్ స్టైల్ చూసి నోరెళ్లపెడుతున్న నెటిజన్స్..

అతడిని అభిమానులు ముద్దుగా బాలీవుడ్ సీరియల్ కిస్సర్ అని పిలుచుకుంటారు. ఒకప్పుడు వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాడు. హీరోగా మెప్పించి ఆ తర్వాత విలన్ గా అదరగొట్టాడు. ఆయన ఎప్పుడూ ఏదోక కారణంతో వార్తలలో నిలుస్తుంటాడు. ఇప్పుడు తన సంపద, ఆస్తుల కారణంగా మరోసారి నెట్టింట హాట్ టాపిక్ అయ్యాడు. ముంబైతోపాటు గోవాలోనూ లగ్జరీ ఇళ్లను కలిగి ఉన్నాడు.

Tollywood : రొమాంటిక్ చిత్రాలకు రారాజు.. ఇప్పుడు తెలుగులో తోపు విలన్.. లైఫ్ స్టైల్ చూసి నోరెళ్లపెడుతున్న నెటిజన్స్..
Emraan Hashmi

Updated on: Aug 12, 2026 | 9:59 AM

బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ హీరోలలో ఇమ్రాన్ హష్మీ ఒకరు. ఒకప్పుడు హిందీ చిత్ర పరిశ్రమలో రొమాంటిక్ చిత్రాలతో ఫేమస్ అయ్యాడు. అందుకే అతడిని అందరూ బాలీవుడ్ సీరియల్ కిస్సర్ అని పిలుచుకుంటారు. విభిన్న పాత్రలు పోషించి తన నటనతో తనదైన ముద్ర వేశారు. ఇప్పటి వరకు అనేక చిత్రాలలో నటించిన ఇమ్రాన్.. ప్రస్తుతం రూటు మార్చారు. తెలుగులో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఓజీ చిత్రంలో పవర్ పుల్ విలన్ పాత్రలో నటించారు. ఈ మూవీతో తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఇమ్రాన్ గురించి ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చ నడుస్తుంది. నివేదికల ప్రకారం అతడి ఆస్తులు దాదాపు 100 కోట్లకు పైగా ఉంటుందని టాక్. అతడు తన ఆదాయంలో అధిక భాగాన్ని సినిమాల ద్వారానే సంపాదిస్తాడు. ఈ నటుడి నికర ఆస్తి విలువ రూ. 105 కోట్ల వరకు ఉంది. సినిమాలు, ప్రకటనల ద్వారా చాలా డబ్బు సంపాదించాడు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : పెళ్లి కాకుండానే కలిసి ఉంటున్నాం.. అప్పుడే విడిపోవాలని అనుకున్నాం.. టాలీవుడ్ నటి..

అంతేకాదు అతడికి రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియో కూడా ఉందని సమాచారం. గోవాలో రూ. 10 కోట్ల విలువైన పెంట్‌హౌస్ , ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఆయనకు సుమారు రూ. 16 కోట్ల విలువైన విలాసవంతమైన అపార్ట్‌మెంట్ కూడా ఉందట. లోనావాలాలో ఆయనకు రూ. 12 కోట్ల విలువైన విల్లా కూడా ఉందని టాక్. ఇమ్రాన్ హష్మీకి ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. అతని గ్యారేజీలో రూ. 3.2 కోట్ల విలువైన లంబోర్ఘిని హురాకాన్, రూ. 2.9 కోట్ల విలువైన రేంజ్ రోవర్ వోగ్, రూ. 1.88 కోట్ల విలువైన ఆడి A8L, రూ. 2.57 కోట్ల విలువైన మెర్సిడెస్ మేబ్యాక్‌తో సహా అనేక ఖరీదైన కార్లు ఉన్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Hemachandra: నేను చేసిన మొదటి తప్పు అదే.. వాటి నుంచి ఎన్నో నేర్చుకున్నాను.. సింగర్ హేమచంద్ర..

ఇమ్రాన్ హష్మీ రాబోయే చిత్రాల విషయానికి వస్తే, ఈ నటుడు త్వరలో ‘ఆవారప్పన్ 2’ చిత్రం ద్వారా తన అభిమానుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రానికి నితిన్ కక్కర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నటి దిశా పటాని ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. ఇది నటుడు సన్నీ డియోల్ , ప్రీతి జింటా నటించిన ‘బత్వారా 1947’ చిత్రానికి గట్టి పోటీ ఇవ్వనుంది.

ఎక్కువ మంది చదివినవి :  Tollywood: ఆ సినిమాను ఆ హీరో తప్ప మరెవరు చేయలేరు.. అందుకే నేను రిజెక్ట్ చేశా.. నటుడు సుమంత్..

ఇమ్రాన్ హష్మీ పోస్ట్..

ఎక్కువ మంది చదివినవి : Cinema : చనిపోయిన అమ్మాయిని వేధించే కుర్రాడు.. ప్రతి 20 నిమిషాలకు ఊహించని మలుపులు.. ఓటీటీని శాసిస్తున్న సినిమా..

Loading...
Unable to load recommendations.
Follow Us