
తెలుగులో స్టైలీష్ విలన్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు రఘువరన్. ఆ తర్వాత చాలా మంది నటులు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో కనిపించి ఆకట్టుకున్నారు. అందులో రాహుల్ దేవ్ ఒకరు. మాస్, ఆంధ్రవాలా వంటి చిత్రాల్లో విలన్ పాత్రలు పోషించి పాపులర్ అయ్యారు. ఇప్పుడు చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే రాహుల్ దేవ్ వయసు ప్రస్తుతం 57 సంవత్సరాలు. ఈ క్రమంలో తనకంటే 18 ఏళ్లు చిన్నదైన మోడల్ కమ్ నటితో ప్రేమలో ఉన్నారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుందామా. రాహుల్ దేవ్ 1968 సెప్టెంబర్ 27న ఢిల్లీలో జన్మించాడు. అక్కడే తన చదువును పూర్తి చేశాడు. అతని తండ్రి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఆయన కుటుంబంలో క్రమశిక్షణ, కఠినమైన వాతావరణం ఉండేది.
ఎక్కువ మంది చదివినవి : JD Chakravarthy : 25 ఏళ్లుగా ఆ ఒక్కటి తినడం మానేసా.. 56 ఏళ్ల వయసులో నా హెల్త్ సీక్రెట్ ఇదే.. జేడీ చక్రవర్తి కామెంట్స్..
రాహుల్ దివంగత సోదరుడు ముకుల్ దేవ్ కూడా బాలీవుడ్ నటుడే. ఈ వాతావరణంలోనే రాహుల్‌కు నటనపై ఆసక్తి పెరిగింది. అతను 2000లో ‘ఛాంపియన్’ చిత్రంతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేశాడు. తెలుగు, హిందీ భాషలలో ఎక్కువగా విలన్ పాత్రలు పోషించి పాపులర్ అయ్యాడు రాహుల్ దేవ్. అతడి కెరీర్ ఎన్నో ఒడిదుడుకులతో సాగింది. తన ఫిట్ నెస్ పై ఎంతో శ్రద్ధ తీసుకున్నాడు. అతని భార్య రీనా దేవ్ 2009లో క్యాన్సర్‌తో మరణించడంతో, అతను తీవ్ర కుంగుబాటుకు గురయ్యాడు. తన కొడుకును ఒంటరిగా పెంచాడు.
ఎక్కువ మంది చదివినవి : Babloo Prithiveeraj : హీరో కంటే బాగా చేశానని ఆ సినిమాలో నా సీన్స్ తీసేశారు.. దెబ్బకు సినిమా రిజల్ట్ మారిపోయింది.. నటుడు పృథ్వీరాజ్..
అదే సమయంలో తనకంటే 18 ఏళ్లు చిన్నదైన మోడల్, నటి ముగ్ధా గోడ్సే పరిచయమైంది. తర్వాత ఆ స్నేహం ప్రేమగా మారింది. వీరిద్దరు 2013 నుండి సహజీవనం చేస్తున్నారు. ముగ్ధా గోడ్సే ఒక నటి కమ్ మోడల్. ఈమె అజయ్ దేవగన్, సంజయ్ దత్ వంటి సూపర్‌స్టార్లతో కలిసి పనిచేయడమే కాకుండా, పలు బాలీవుడ్ చిత్రాలలో కూడా కనిపించారు.
ఎక్కువ మంది చదివినవి : Raviteja : జీవితంలో ఆయనను మర్చిపోలేను.. నన్ను మరో స్థాయికి తీసుకెళ్లాడు.. రవితేజ..
ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi: ఆమె గొప్ప నటి.. ఆమె టాలెంట్ స్వయంగా చూశా.. కానీ సక్సెస్ కాలేకపోయింది.. కారణం ఇదే.. డైరెక్టర్ కృష్ణవంశీ..