AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Keerthy Suresh: 9 కిలోలు తగ్గిన కీర్తి సురేష్.. హీరోయిన్ డైట్ సీక్రెట్ ఇదే.. ఈ టిప్స్ పాటిస్తే చాలు..

'మహానటి' కీర్తి సురేష్ దాదాపు 9 కేజీల బరువు తగ్గినట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. దీంతో ఇప్పుడు ఇదే విషయం నెట్టింట తెగ వైరలవుతుంది. తన ఫిట్‌నెస్ ప్రయాణం గురించి మాట్లాడుతూ, మొదట్లో తాను ఎక్కువగా కార్డియో వ్యాయామాలు చేశానని, ఆ తర్వాత తన ఆహారంలో ప్రోటీన్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చానని ఆ నటి చెప్పింది.

Keerthy Suresh: 9 కిలోలు తగ్గిన కీర్తి సురేష్.. హీరోయిన్ డైట్ సీక్రెట్ ఇదే.. ఈ టిప్స్ పాటిస్తే చాలు..
Keerthy Suresh
Rajitha Chanti
|

Updated on: Aug 31, 2026 | 9:25 AM

Share

దక్షిణాది టాప్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆమె.. ఇప్పుడు ది ప్యారడైజ్ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఏశనాగుల కట్ట మీద పాటతో థియేటర్లలో ఊర్రుతలూగించడానికి సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ‘మహానటి’ కీర్తి సురేష్ తన ఫిట్‌నెస్ , అద్భుతమైన ట్రాన్స్‌ఫార్మేషన్‌తో అభిమానులను ఆకట్టుకుంటారు. గతంలో సినిమా పాత్ర కోసం ఆమె ఏకంగా 9 కిలోల బరువు తగ్గి వార్తల్లో నిలిచారు. క్రష్ డైటింగ్ లేదా కఠినమైన ఆహార నియమాలు లేకుండా, కేవలం సరైన వ్యాయామం , సమతుల్య ఆహారంతోనే ఇది సాధ్యమైందని గతంలో ఓ ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ వెల్లడించారు. బరువు తగ్గించే క్రమంలో కీర్తి సురేష్ ప్రధానంగా కార్డియో వ్యాయామాలపై దృష్టి సారించారు. రోజూ క్రమం తప్పకుండా కార్డియో చేయడం వల్ల శరీరంలో కేలరీలు వేగంగా ఖర్చయ్యాయి. అయితే, ప్రారంభంలో ఎక్కువ కార్డియో చేయడం వల్ల కండరాల ద్రవ్యరాశి (muscle mass) తగ్గిందని గ్రహించిన ఆమె, తరువాత తన వర్కౌట్ రూటీన్‌లో మార్పులు చేశారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood: కొత్తింట్లోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరోయిన్.. ఫ్యామిలీతో కలిసి గృహ ప్రవేశం.. ఫోటోస్ వైరల్..

ప్రస్తుతం ఆమె కార్డియోతో పాటు స్ట్రెంత్ ట్రైనింగ్ , యోగాను క్రమం తప్పకుండా చేస్తున్నారు. ఇది ఆమె శరీరానికి దృఢత్వాన్ని, సౌలభ్యాన్ని అందించింది. కీర్తి సురేష్ బరువు తగ్గడానికి ‘కీటో’ వంటి ఏ విధమైన తీవ్రమైన డైట్‌లను అనుసరించలేదు. ఆమె హై-ప్రోటీన్, లో-కార్బోహైడ్రేట్ ఆహారాన్ని ఎంచుకున్నారు. విశేషమేమిటంటే, ఆమె ఎలాంటి ప్రోటీన్ షేక్స్ లేదా సప్లిమెంట్స్ తీసుకోకుండా కేవలం సహజ సిద్ధమైన ఆహారపదార్థాలనే తీసుకున్నారు.

ఎక్కువమంది చదివినవి : Nagarjuna : ఆయన తినే రైస్ మనం తినలేము.. నాగార్జున డైట్ రివీల్ చేసిన మేకప్ ఆర్టిస్టు..

ఆమె రోజుకు సుమారు 6 నుండి 7 గుడ్డు తెల్లసొనలు తింటారని సమాచారం.. ఇది శరీరానికి నాణ్యమైన ప్రోటీన్‌ను అందిస్తుంది. పనీర్, టోఫు, సోయా, శనగలు (Chana/Pulses) వంటి పదార్థాలను ఆమె దినచర్యలో భాగం చేసుకున్నారు. ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర మరియు ఎక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న పదార్థాలకు దూరంగా ఉంటూ నాచురల్ ప్రొటీన్‌కే ప్రాధాన్యత ఇచ్చారు. ఆమె సూత్రం ప్రకారం, ఇష్టమైన ఆహారాన్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. మన శరీర తత్వానికి తగ్గట్టుగా సరైన పోషకాలున్న ఆహారాన్ని తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గవచ్చు.

ఎక్కువమంది చదివినవి : Cinema : దేశాన్ని కుదిపేసిన నిజమైన సంఘటనతో తీసిన సినిమా.. ఓటీటీలో భయం పుట్టించింది.. ట్రెండింగ్‌లో నంబర్ వన్..

ఎక్కువమంది చదివినవి : Soundarya: సౌందర్య ఫస్ట్ సినిమా హీరో ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా.. ? 13 ఏళ్లకే స్టార్ డమ్.. ఇప్పుడు ఇలా..

Follow Us
పాపికొండల విహారయాత్రకు అధికారుల గ్రీన్ సిగ్నల్
పాపికొండల విహారయాత్రకు అధికారుల గ్రీన్ సిగ్నల్
ఎలక్ట్రిక్ కారుపై సోలార్ ప్యానెల్స్‌.. ఛార్జింగ్ ఖర్చు తగ్గుతుందా
ఎలక్ట్రిక్ కారుపై సోలార్ ప్యానెల్స్‌.. ఛార్జింగ్ ఖర్చు తగ్గుతుందా
జ్ఞాపకాల కోసం 112 ఏళ్ల పురాతన ఇంటిని 9 కి.మీ. దూరం తరలించిన మహిళ!
జ్ఞాపకాల కోసం 112 ఏళ్ల పురాతన ఇంటిని 9 కి.మీ. దూరం తరలించిన మహిళ!
ఎరక్కపోయి ఇరుకున్నాడు.. యూట్యూబ్‌లో చూసి బంగారం కోసం వేట..
ఎరక్కపోయి ఇరుకున్నాడు.. యూట్యూబ్‌లో చూసి బంగారం కోసం వేట..
రవి, శుక్రుల యుతి..వీరికి కొత్త ఉద్యోగ ఆఫర్లు ఖాయం..!
రవి, శుక్రుల యుతి..వీరికి కొత్త ఉద్యోగ ఆఫర్లు ఖాయం..!
యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్..
యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్..
ప్రియుడి కోసం భారత్‌కు రష్యా యువతి
ప్రియుడి కోసం భారత్‌కు రష్యా యువతి
అరెరె ఇన్నాళ్లు తెలియకుండా తిన్నారా.. కరివేపాకు వీరికి యమడేంజర్..
అరెరె ఇన్నాళ్లు తెలియకుండా తిన్నారా.. కరివేపాకు వీరికి యమడేంజర్..
8 నెలల కష్టం ఒక్క నెలలోనే వృథా.. మళ్లీ రంగంలోకి బిట్టు తబాహి!
8 నెలల కష్టం ఒక్క నెలలోనే వృథా.. మళ్లీ రంగంలోకి బిట్టు తబాహి!
నెటిజన్ అసభ్యకరమైన కామెంట్స్.. కౌంటరిచ్చిన వేణు స్వామి భార్య
నెటిజన్ అసభ్యకరమైన కామెంట్స్.. కౌంటరిచ్చిన వేణు స్వామి భార్య