Bellamkonda Sai Srinivas: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భార్య ఏం బిజినెస్ చేస్తుందో తెలుసా? నెలకు అన్ని లక్షలా?

టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇటీవల ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. కావ్యా రెడ్డి అనే అమ్మాయితో కలిసి పెళ్లిపీటలెక్కాడీ యాక్షన్ హీరో. అయితే కావ్యా రెడ్డి బ్యాక్ గ్రౌండ్ ఏంటో చాలా వరకు తెలియదు. ఈ నేపథ్యంలో ఆమె గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

Bellamkonda Sai Srinivas: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భార్య ఏం బిజినెస్ చేస్తుందో తెలుసా? నెలకు అన్ని లక్షలా?
Bellamkonda Sai Srinivas

Updated on: May 07, 2026 | 3:50 PM

టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వివాహం ఇటీవలే అట్టహాసంగా జరిగింది. తిరుమల శ్రీవారి సన్నిధిలో జరిగిన వీరి వివాహ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఆ తర్వాత హైదరాబాద్ లో నిర్వహించిన గ్రాండ్ రిసెప్షన్ కు కూడా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు వచ్చారు. నూతన దంపతులను మనసారా ఆశీర్వదించారు. బెల్లంకొండ శ్రీనివాస్- కావ్యా రెడ్డిల పెళ్లి, రిసెప్షన్ ఫొటోలు ఇప్పటికీ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా కావ్యారెడ్డి బ్యాక్ గ్రౌండ్ గురించి ఇప్పటివరకు పెద్దగా సమాచారం బయటకు రాలేదు. కావ్య రెడ్డిది హైదరాబాదే అని, ఓ ప్రముఖ న్యాయవాది కూతురుని మాత్రమే తెలిసింది. కావ్య కూడా లా స్టూడెంట్ అన్న సమాచారం మాత్రమే బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు కావ్యా రెడ్డి గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

తండ్రి, తాతల మాదిరిగానే లా చదవిందట కావ్యా రెడ్డి. ఈ నేపథ్యంలో ఆమె ఒకవైపు లాయర్ గానే ఉంటూ మరోవైపు బిజినెస్ కూడా చేస్తుందట. అదేంటంటే.. అరటి చెట్టు నుంచి వచ్చే నారతో దారాలుగా మార్చి చీరలను తయారు చేసి అమ్ముతున్నారట. ముఖ్యంగా విదేశాల్లో ఈ బిజినెస్ కి మంచి డిమాండ్ ఉందట. దీంతో కావ్యకు భారీగానే ఆదాయం వస్తుందట. నెలకు సుమారు రూ. 90 లక్షల ఆదాయం వస్తుందట. దీంట్లో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ బిజినెస్ గురించి పూర్తి క్లారిటీ రావాలంటే బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యా రెడ్డి దంపతులు లేదా వారి కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు స్పందించాలి.

ఇవి కూడా చదవండి

బెల్లంకొండ సాయి శ్రీనివాస్- కావ్యారెడ్డిల పెళ్లి ఫొటోలు..

ఇక సినిమాల విషయానికి వస్తే.. కిష్కింధపురి సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ప్రస్తుతం ఈ హీరో చేతిలో ‘టైసన్ నాయుడు’, ‘హైందవ’ వంటి క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.

భార్య కావ్యారెడ్డితో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us