The Kerala Story 2: ‘ఆ తర్వాతే తుది ఉత్తర్వులు ఇస్తాం’.. ది కేరళ స్టోరీ సినిమాకు హైకోర్టులో చుక్కెదురు

'ది కేరళ స్టోరీ 2' సినిమా ఈ శుక్రవారం (ఫిబ్రవరి 27)న విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ సినిమాపై చాలా చోట్ల తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ సినిమా కేరళ రాష్ట్రాన్ని చెడుగా చూపిస్తోందని స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్ ఆందోళన వ్యక్తం చేశారు.అంతేకాదు మతాల మధ్య సామరస్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకుందని కొందరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

The Kerala Story 2: ఆ తర్వాతే తుది ఉత్తర్వులు ఇస్తాం.. ది కేరళ స్టోరీ సినిమాకు హైకోర్టులో చుక్కెదురు
The Kerala Story 2 Movie

Updated on: Feb 25, 2026 | 7:44 AM

‘ది కేరళ స్టోరీ 2’ సినిమా విడుదలపై సందిగ్ధం కొనసాగుతోంది. ఈ సినిమా ఫిబ్రవరి 27 శుక్రవారం విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ మూవీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వయంగా ‘ది కేరళ స్టోరీ 2’ సినిమాను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సినిమా కేరళ రాష్ట్రాన్ని చెడుగా చూపిస్తోందని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.అంతే కాదు మతాల మధ్య సామరస్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకుందని ఈ మూవీపై ఫిర్యాదులు కూడా దాఖలయ్యాయి, ఈ సందర్భంలో, కేరళ హైకోర్టు మంగళవారం (ఫిబ్రవరి 24) విచారణ నిర్వహించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ సందర్భంగా జస్టిస్ బెచు కురియన్ థామస్ మాట్లాడుతూ, “కేరళ రాష్ట్రం మత సామరస్యానికి ప్రతీక. కానీ మీరు బలవంతపు మతమార్పిడి వంటి సంఘటనలను కేరళ రాష్ట్రం అంతటా జరుగుతున్నట్లుగా చిత్రీకరించారు. ఇది తప్పుడు సందేశాన్ని పంపడమే కాకుండా ప్రజల మనోభావాలను కూడా దెబ్బతీస్తుంది. అలాగనీ మేం సినిమాల కంటెంట్‌లో జోక్యం చేసుకోలేదు. కళాత్మక స్వేచ్ఛను ఉల్లంఘించడం లేదు. కానీ ఈ సినిమా ‘వాస్తవ సంఘటనల నుండి ప్రేరణ పొందింది’ అనే ప్రకటన ప్రజల మధ్య చిచ్చు పెట్టే అవకాశం ఉంది’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తుది తీర్పు ఇచ్చే ముందు సినిమాను స్వయంగా చూస్తామని చెప్పిన కోర్టు, బుధవారం మధ్యాహ్నం దాని కోసం ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం అలాగే చిత్ర బృందాన్ని ఆదేశించింది.

ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వర్య ఓజా ప్రధాన పాత్రల్లో నటించిన ది కేరళ స్టోరీ 2 చిత్రానికి సెన్సార్ బోర్డు ‘U/A’ సర్టిఫికేట్ ఇచ్చింది. కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన బలవంతపు మతమార్పిడుల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారని చెబుతున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌లో ముస్లిం సమాజానికి చెందిన కొంతమంది హిందూ అమ్మాయికి బలవంతంగా గొడ్డు మాంసం తినిపించే సన్నివేశం ఉంది. దీంతో పాటు పలు వివాదాస్పద సీన్స్ ఇందులో ఉన్నాయని టాక్.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలోనే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ చిత్రంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “మత సామరస్యానికి ప్రతీకైన కేరళను ఉగ్రవాద కేంద్రంగా చిత్రీకరించే ప్రయత్నాలను మనం వ్యతిరేకించాలి. తప్పుడు ప్రచారం ద్వారా మన లౌకిక పునాదిని నాశనం చేయడానికి మేము అనుమతించం’ అని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం (ఫిబ్రవరి 25) సినిమా చూసిన తర్వాత హైకోర్టు ఇచ్చే తీర్పుపై సినిమా భవితవ్యం ఆధారపడి ఉంటుంది. ఈ చిత్రం శుక్రవారం విడుదల అవుతుందా లేదా చట్టపరమైన అడ్డంకులను ఎదుర్కొంటుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us