
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ జోష్ మీదున్నాడు. దసరా, హాయ్ నాన్న చిత్రాలతో వరుస హిట్స్ అందుకున్న ఈ హీరో.. ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ విషయంలోనూ ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరపోదా శనివారం సినిమా చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో ఇదివరకు అంటే సుందరానికి సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి వీరి కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ రాబోతుంది. సరిపోదా శనివారం సినిమాలో నాని సరసన ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. నటుడు ఎస్జే సూర్య కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను ఆగస్ట్ 29నరిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే కొద్దిరోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఇదివరకే రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలతో ఫుల్ బిజీగా ఉన్నారు నాని. ఈ క్రమంలోనే తాజాగా ఓ తమిళ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర ఘటన జరిగింది.
ఈ ఇంటర్వ్యూలో నానితోపాటు, ప్రియాంక, సూర్య కూడా పాల్గొన్నారు. ఇంటర్వ్యూలో యాంకర్ నానికి ఓ రిక్వెస్ట్ చేసింది. ఓ అమ్మాయి మీకు చాలా పెద్ద ఫ్యాన్. మీతో మాట్లాడాలని చాలాసేపటి నుంచి ఫోన్ చేస్తూనే ఉంది.. మాట్లాడతారా అని అడగ్గా.. నాని ఓకే అంటూ ఫోన్ తీసుకున్నారు. “హాయ్ సార్.. ఎలా ఉన్నారు . నా పేరు గాయత్రి. మీకు చాలా పెద్ద అభిమానిని. ఎప్పటి నుంచి కలవాలని ట్రై చేస్తున్నా.. ఈసారి చెన్నై వచ్చినప్పుడు తప్పకుండా చెప్పండి ” అంటూ అవతలి అమ్మాయి మాట్లాడగా.. అయ్యో తప్పకుండా కలుస్తాను.. ఈరోజు ఓకే నేను ఇక్కడే ఉంటే వచ్చి కలవొచ్చు అని నాని అన్నారు. దీనికి ఆ అమ్మాయి మాట్లాడుతూ.. ‘అవునా సర్.. ఈ ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు.. మీ భార్య ఎలా ఉంది’ అంటూ ఏదో ముద్దుపేరుతో పిలిచింది. దీంతో నాని ఆ అమ్మాయి కీర్తి సురేష్ అని గుర్తుపట్టేశారు. ఆ తర్వాత రఘుతాత సినిమా విజయానికి కంగ్రాట్స్ తెలిపారు.
కీర్తి సురేష్ వాయిస్ మార్చి మాట్లాడడంతో అంతా షాకయ్యారు. ముఖ్యంగా హీరోయిన్ ప్రియాంక మోహనన్.. ఆ అమ్మాయి కీర్తి సురేషా అంటూ అవాక్కయ్యింది. నటుడు ఎస్జే సూర్య ఫోన్ తీసుకుని వాయిస్ మార్చి మాట్లాడగా.. కీర్తి గుర్తుపట్టేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. నాని, కీర్తి ఇద్దరు కలిసి నేను లోకల్, దసరా చిత్రాల్లో నటించారు.
Keerthi Suresh's Prank Call To Nani During Promotions 😂😂😂❤️
Last lo SJ Surya 🤣🤣🤣#SaripodhaaSanivaaram pic.twitter.com/ccFA3HKDxG
— Nanii!! ˢᵃʳⁱᵖᵒᵈʰᵃᵃ ˢᵃⁿⁱᵛᵃᵃʳᵃᵐ (@narasimha_chow2) August 18, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.