Karthika Deepam: “డాక్టర్ బాబు అంటూ.. ఎప్పుడూ ఏడుస్తూ ఉంటూ..” తెలుగు ప్రేక్షకులను తెగ ఆకట్టుకునే వంటలక్క రూటు మార్చారు. అల వైకుంఠపురంలోని అల్లు అర్జున్ స్టైల్లో ఓ చేతితో కత్తి పట్టి.. మరో చేతిలో కోడి పుంజు పెట్టుకుని… సిగరెట్ తాగుతూ.. పొలం గట్ల వెంట తిరుగుతున్నారు. అయితే ఈ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఇటీవల ఈ వంటలక్క కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అంతేకాదు.. వ్యాక్సిన్ అందరూ తీసుకోవాలని.. అందుకు భయపయపడాల్సిన అవసరం లేదని చెబుతూ ఓ వీడియోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. వ్యాక్సిన్ తీసుకోడానికి తాను కూడా మొదట భయపడ్డానని.. కాని ఆ తరువాత తీసుకున్నానని ఆమె చెప్పారు. వ్యాక్సిన్ తీసుకునే క్రమంలో పెద్దగా నొప్పి ఉండదని… కావున భయపడకుండా అందరూ టీకా తీసుకుని కరోనా నుంచి రక్షణ పొందాలని ఆమె సూచించారు.
మరిన్ని ఇక్కడ చదవండి :