గత కొన్ని రోజులుగా సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే టీనేజ్ మోడల్స్, యంగ్ హీరో శరత్ చంద్ర మృతిచెందగా.. ప్రస్తుతం మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సింగర్ నేషనల్ అవార్డు గ్రహీత శివమొగ్గ సుబ్బన్న (Singer Shivamogga) గురువారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. 83 ఏళ్ల సుబ్బన్న గతరాత్రి ఛాతిలో నొప్పి రావడంతో నగరంలోని జయదేవ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ గత అర్ధరాత్రి మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయనకు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు.
1978లో ‘కాదు కుదురే’ చిత్రంలోని ‘కాదు కుదురే ఒడి బండిట్టా’ పాటకు జాతీయ అవార్డు లభించింది. కన్నడ సంగీత ప్రపంచంలో ఈ అవార్డు అందుకున్న మొదటి గాయకుడు సుబ్బన్న. ఇండస్ట్రీలోకి రాకముందు ఆయన లాయర్‌గా పనిచేశారు. అదే సమయంలో ఆయన ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్‌లో నపిచేశారు. 1938 డిసెంబర్ 14న జన్మించిన సుబ్బన్న అనేక అవార్డులు అందుకున్నారు. 2008లో కువెంపు యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్, 2009లో సుందర్ శ్రీ అవార్డు లభించాయి.