Tollywood: నటుడిగా అవకాశమిచ్చిన పాత్ర.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది.. ఈ హీరోను గుర్తుపట్టారా ?..
కొన్నాళ్లకు మెగాఫోన్ చేతబట్టి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించాడు. ఆరో తరగతిలో నాటకంపై ఉన్న ఇష్టంతో వేసిన పాత్ర .. సినీరంగంవైపు అడుగులు పడేలా చేసింది. చివరకు అదే పాత్ర ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. పైన ఫోటోలో కనిపిస్తున్న కుర్రాడు ఒకే ఒక్క సినిమాతో యావత్ ప్రపంచాన్ని తనవైపుకు తిప్పుకున్నాడు. ఏకంగా తన సినిమాను ఐక్యరాజ్య సమితిలో ప్రదర్శించారు.
నటుడిగా చిన్నవయసులోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత హీరోగా అలరించాడు. కొన్నాళ్లకు మెగాఫోన్ చేతబట్టి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించాడు. ఆరో తరగతిలో నాటకంపై ఉన్న ఇష్టంతో వేసిన పాత్ర .. సినీరంగంవైపు అడుగులు పడేలా చేసింది. చివరకు అదే పాత్ర ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. పైన ఫోటోలో కనిపిస్తున్న కుర్రాడు ఒకే ఒక్క సినిమాతో యావత్ ప్రపంచాన్ని తనవైపుకు తిప్పుకున్నాడు. ఏకంగా తన సినిమాను ఐక్యరాజ్య సమితిలో ప్రదర్శించారు. అతడే రిషబ్ శెట్టి. కన్నడ సినీ పరిశ్రమలో నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు. కిరిక్ పార్టీ సినిమాతో దర్శకుడిగా భారీ విజయాన్ని అందుకున్నాడు. కన్నడలో ఎన్నో చిత్రాలను తెరకెక్కించిన రిషబ్ శెట్టికి వరల్డ్ వైడ్ పాపులారిటీని తెచ్చిపెట్టింది మాత్రం కాంతార సినిమానే.
2022లో ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన సినిమా కాంతారా. ముందుగా కన్నడలో రిలీజ్ అయి భారీ విజయాన్ని అందుకున్న ఈ మూవీని తర్వాత తెలుగు, మలయాళం, తమిళం, హిందీ భాషలలో రిలీజ్ చేయగా.. ఊహించని రెస్పాన్స్ వచ్చింది. జాతీయ స్థాయిలోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవల్లో ఈ సినిమా గురించి మాట్లాడుకున్నారు. 2023లో జరిగిన ఐక్యరాజ్య సమితిలో ఈ చిత్రాన్ని ప్రదర్శించగా.. ముఖ్య అతిథిగా రిషబ్ శెట్టి హజరయ్యాడు. ఇందులో రిషబ్ శెట్టి పంజర్ల వేషధారణలో చేసిన యక్షగాన పర్ఫామెన్స్ ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ తెప్పించింది. అయితే వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చిన పంజర్లీ పాత్రతోనే దశాబ్దాల క్రితం నటుడిగా సినీ ప్రయాణం స్టార్ట్ చేశాడట రిషబ్ శెట్టి. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.
రిషబ్ శెట్టి మాట్లాడుతూ “ఆర్టిస్ట్‌గా నా ప్రయాణం నేను ఆరో తరగతి చదువుతున్నప్పుడే మొదలైంది. ఈ సమయంలో నేను యక్షగానం ప్రదర్శించాను. అప్పటి నుంచి నా ప్రాంతపు జానపద కథలను ప్రజల ముందుకు తీసుకురావాలనేది నా కల” అంటూ చెప్పుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా కాంతార సినిమా దాదాపు రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.