‘కాంచన 3’ నటికి వేధింపులు.. నటుడు అరెస్ట్..

| Edited By: Srinu

Apr 25, 2019 | 7:18 PM

ఇటీవల విడుదలైన లారెన్స్ హారర్ చిత్రం కాంచన-3 సినిమాలో నటించిన రష్యన్ బ్యూటీ రి డ్జావి అలెగ్జాండ్రాకి లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. నటుడు రుబేశ్ కుమార్ తనను తరుచూ లైంగికంగా వేధిస్తున్నాడని.. వేధింపులు భరించలేకనే పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. కాగా.. నటుడు రుబేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. రష్యన్‌కు చెందిన రి డ్జావి గత కొన్ని సంవత్సరాల క్రితమే చెన్నైలో తన భర్త, పిల్లలతో స్థిరపడింది. తరుచూ యాడ్స్‌లలో, సినిమాల్లో నటిస్తూ […]

కాంచన 3 నటికి వేధింపులు.. నటుడు అరెస్ట్..
Follow us on

ఇటీవల విడుదలైన లారెన్స్ హారర్ చిత్రం కాంచన-3 సినిమాలో నటించిన రష్యన్ బ్యూటీ రి డ్జావి అలెగ్జాండ్రాకి లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. నటుడు రుబేశ్ కుమార్ తనను తరుచూ లైంగికంగా వేధిస్తున్నాడని.. వేధింపులు భరించలేకనే పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. కాగా.. నటుడు రుబేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.

రష్యన్‌కు చెందిన రి డ్జావి గత కొన్ని సంవత్సరాల క్రితమే చెన్నైలో తన భర్త, పిల్లలతో స్థిరపడింది. తరుచూ యాడ్స్‌లలో, సినిమాల్లో నటిస్తూ ఉంటుంది. అయితే.. తనతో పాటు యాడ్స్‌లలో నటించిన నటుడు రూబేశ్ అవకాశాల పేరు చెప్పి, తనను విచిత్రంగా ఫొటోలు తీశాడని, రోజూ వాట్సాప్‌లో ఫొటోలు పంపుతూ.. కోరిక తీర్చకుంటే.. సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరిస్తున్నాడని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించింది.