Singer Kalpana: గాయని కల్పన ఆత్మహత్యయత్నం.. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..?

అపస్మారక స్థితిలో మంగళవారం రాత్రి KPHBలోని హోలిస్టిక్‌ ఆసుపత్రిలో చేరిన గాయని కల్పనకు (Singer Kalpana) చికిత్స కొనసాగుతోంది. కల్పనను పరామర్శించేందుకు పలువురు ప్రముఖ సింగర్స్ మంగళవారం రాత్రి ఆసుపత్రికి చేరుకున్నారు. సునీత, గీతామాధురి, శ్రీకృష్ణ, కారుణ్య తదితరులు అక్కడికి చేరుకొని ఆమె ఆరోగ్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

Singer Kalpana: గాయని కల్పన ఆత్మహత్యయత్నం.. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..?
Kalpana

Updated on: Mar 05, 2025 | 10:00 AM

ఆత్మహత్యాయత్నం చేసిన సింగర్ కల్పనకు హాస్పిటల్‌లో చికిత్స కొనసాగుతోంది.  ఆమె స్పృహలోకి వచ్చారని, ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ప్రాణపాయం లేదని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌లో వెంటిలేటర్‌ ఉంచి చికిత్స అందిస్తున్నారు. కల్పన భర్త ప్రసాద్ చెన్నైలో ఉంటుండటంతో నిజాంపేట్‌లోని ఇంట్లో ఒంటరిగా ఉంటుందామె. ఆత్మహత్య ఘటన నేపథ్యంలో కల్పన భర్త ప్రసాద్‌ను పోలీసులు విచారిస్తున్నారు. హైదరాబాద్ నిజాంపేట్‌ రోడ్‌ వర్టెక్స్ ప్రివిలేజ్‌ విల్లాస్‌లో ఉంటున్న కల్పన.. నిద్రమాత్రలు ఎక్కువ సంఖ్యలో మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. రెండు రోజులైనా ఇంటి తలుపులు తీయకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. ముందుగా చెన్నైలో ఉన్న కల్పన భర్త ప్రసాద్‌కు… ఆ తర్వాత లోకల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇంట్లోకి వెళ్లే సరికి గాఢనిద్రలో ఉన్నారు కల్పన. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను వీల్‌చైర్‌లో ఆస్పత్రికి తరలించారు.

టాలీవుడ్‌లో అత్యంత పాపులర్‌ సింగర్లలో కల్పన ఒకరు. మధురమైన గాత్రంతో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడి శ్రోతలను మైమరపించింది. రీసెంట్‌గా ఓ ఈవెంట్‌లో కూడా పాల్గొన్నారు. ఆల్ ఆఫ్ సడెన్‌గా కల్పన ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేసిందన్నది మిస్టరీగా మారింది. ఇక కల్పన సూసైడ్ అటెంప్ట్ చేసిందన్న సమాచారంతో తోటి సింగర్స్‌ ఒక్కొక్కరుగా హాస్పిటల్‌కు చేరుకుంటున్నారు.

వ్యక్తిగత ఇబ్బందులా..? ఇంకేవైనా కారణాలు ఉన్నాయా..? కల్పన హైదరాబాద్‌లో ఉంటే భర్త ప్రసాద్‌ చెన్నైలో ఎందుకు ఉంటున్నారు? రెండు రోజులుగా అసలు కల్పనకు ప్రసాద్ ఫోన్ ఎందుకు చేయలేదు? స్థానికులు సమాచారం ఇచ్చే దాకా భర్తకు తెలియకుండా ఉంటుందా? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.