బద్వేలు నియోజకవర్గం కొండుగారిపల్లెలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడు సుబ్బారెడ్డి మద్యం మత్తులో నాలుగో తరగతి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆగ్రహించి నిందితుడికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.