AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sara Arjun: ఆమె వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. ఎమోష్నలైన సారా అర్జున్

సినిమా ప్రపంచంలో హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకోవడం అంత సులభం కాదు. ఒక్క సినిమాతో సక్సె్స్ అయినవారు చాలా మంది ఉన్నారు. కానీ మొదటి సినిమా ఫలితం కాస్త అటు ఇటు అయితే పరిస్థితి మొత్తం మారిపోతుంది. కొన్నిసార్లు తారల జీవితాలు కూడా మారిపోతుంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ సైతం ఆ జాబితాలోకి చెందినవారే.

Sara Arjun: ఆమె వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. ఎమోష్నలైన సారా అర్జున్
Sara Arjun
Rajeev Rayala
|

Updated on: Feb 03, 2026 | 4:16 PM

Share

బాలనటిగా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది సారా అర్జున్, నాన్న పొన్నియిన్ సెల్వన్ వంటి భారీ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది సారా అర్జున్. ఇటీవలే ధురంధర్ సినిమాలోనూ నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు తెలుగులో యుఫోరియా అనే సినిమా చేస్తుంది. ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానింది. ఈ సినిమాలో భూమిక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ జెట్ స్పీడ్ లో జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో సారా అర్జున్ మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకుంది. యుఫోరియా వంటి కథను ఒక నటిగా, ముఖ్యంగా యువతలో ఒకరిగా, ప్రేక్షకులకు అందించాలనే బలమైన కోరిక కలిగిందని సారా తెలిపింది. అయితే యుఫోరియా చిత్రీకరణ సమయంలోనే ఆమె ధురంధర్ కు సంతకం చేయడం విశేషం.

యుఫోరియాలో చైత్రా అనే కీలక పాత్రను పోషించిన సారా, ఈ పాత్ర గురించి తెలిపింది. ఈ పాత్రను ఎంపిక చేయడానికి నీలిమ, రాగిణి ఎంతగానో కృషి చేశారట. పొన్నియిన్ సెల్వన్ లో సారా నటనను చూసి, ఈ వయసు, పాత్రకు సరిపోయే నటి సారా అర్జునే అని ఫిక్స్ అయ్యారట. ఈ పాత్రలో సారా అద్భుతంగా నటించారని చిత్ర బృందం ప్రశంసించింది. సినీ పరిశ్రమ వాతావరణంలో పెరగడం, కుటుంబ సభ్యులు కూడా ఇదే వృత్తిలో ఉండటం ఆమెకు కలిసి వచ్చింది.

ఆమె తండ్రి రాజ్‌ అర్జున్ కథల ఎంపికలో కీలక పాత్ర పోషిస్తారని, సరైన కథలను ఎంచుకోవడంలో ఆయన చాలా కఠినంగా ఉంటారని సారా తెలిపింది. ఆయనను ఒప్పించడం అంత సులభం కాదని, కానీ యుఫోరియా కథ సారా, రాజ్‌ అర్జున్ ఇద్దరికీ బాగా నచ్చిందని మూవీ టీమ్ తెలిపింది. అలాగే, తన తల్లి నిరంతరం తన వెంట ఉండి, ప్రతి క్షణం మద్దతుగా నిలిచిందని, మానసిక స్థైర్యాన్ని ఇచ్చే స్తంభంలా ఉన్నారని సారా తెలిపింది. ఆమె వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా అని  ఎమోషనల్ గా తెలిపింది సారా. అలాగే తల్లిదండ్రుల అండదండలు, వారి పేరెంటింగ్ ఈ కథకు, అందులోని యువత పాత్రలకు, సినిమాలోని కొన్ని అంశాలకు చాలా ఉపయోగపడ్డాయని చిత్ర బృందం చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Sasha Jairam (@sashajairam)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us
2వ మ్యాచ్‌కు ముందే టీమిండియాకు 2 శుభవార్తలు, ఒక డేంజరస్ అలర్ట్.!
2వ మ్యాచ్‌కు ముందే టీమిండియాకు 2 శుభవార్తలు, ఒక డేంజరస్ అలర్ట్.!
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? గరుడ పురాణం ప్రకారం తొలి 13
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? గరుడ పురాణం ప్రకారం తొలి 13
TET 2026కు భారీ స్పందన.. 56 వేల ఇన్‌-సర్వీస్ టీచర్ల దరఖాస్తులు
TET 2026కు భారీ స్పందన.. 56 వేల ఇన్‌-సర్వీస్ టీచర్ల దరఖాస్తులు
ఈసారి వానలు పడవా? జూలైలో ఆకాశం చూడాల్సిందేనా?
ఈసారి వానలు పడవా? జూలైలో ఆకాశం చూడాల్సిందేనా?
కేంద్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం.. 3 యాప్‌లపై నిషేధం!
కేంద్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం.. 3 యాప్‌లపై నిషేధం!
మన పూర్వీకులంతా బలంగా ఉక్కులా ఉండడానికి వారు తాగిన డ్రింక్ ఇదే
మన పూర్వీకులంతా బలంగా ఉక్కులా ఉండడానికి వారు తాగిన డ్రింక్ ఇదే
ఇక దేశ వ్యాప్తంగా NEETకు స్వస్తి.. బోర్డు పరీక్షలకు 50% వెయిటేజీ
ఇక దేశ వ్యాప్తంగా NEETకు స్వస్తి.. బోర్డు పరీక్షలకు 50% వెయిటేజీ
ఈ ఏడాది ఫోన్ రేట్లు తగ్గుతాయా..? తెరపైకి కొత్త ప్రతిపాదన..
ఈ ఏడాది ఫోన్ రేట్లు తగ్గుతాయా..? తెరపైకి కొత్త ప్రతిపాదన..
యూరప్‌లో ఎండల విధ్వంసం.. కరిగిపోతున్న యూకే రోడ్లు
యూరప్‌లో ఎండల విధ్వంసం.. కరిగిపోతున్న యూకే రోడ్లు
ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు.. వర్షాకాలంలో ఆస్పత్రి మెట్లు..
ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు.. వర్షాకాలంలో ఆస్పత్రి మెట్లు..