Actress : నల్లగా, లావుగా ఉన్నావ్.. నువ్వు హీరోయిన్ ఏంటీ అన్నారు.. కట్ చేస్తే.. ఇండస్ట్రీనే ఏలేసింది.. ఎవరంటే..

నటనపై ఆసక్తి.. నటిగా గుర్తింపు తెచ్చుకోవాలనే ఆశలతో చాలా మంది అమ్మాయిలు ఇండస్ట్రీలోకి వస్తుంటారు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటారు. ఆ తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ స్టార్ స్టేటస్ సంపాదించుకుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ సైతం అనేక విమర్శలు ఎదుర్కోంది.

Actress : నల్లగా, లావుగా ఉన్నావ్.. నువ్వు హీరోయిన్ ఏంటీ అన్నారు.. కట్ చేస్తే.. ఇండస్ట్రీనే ఏలేసింది.. ఎవరంటే..
Kajol

Updated on: Aug 29, 2025 | 9:24 PM

ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ సంపాదించుకోవడం అంత సులభం కాదు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. కెరీర్ ప్రారంభంలో అనేక అవమానాలు, విమర్శలను దాటుకుని హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న తారలు చాలా మంది ఉన్నారు. హీరోయిన్లుగా ఎదిగే క్రమంలో బాడీ షేమింగ్, లుక్స్ పరంగా అనేక అవమానాలను ఎదుర్కొంటారు. అయితే కెరీర్ మొదట్లో చాలా కామెంట్స్ భరించి.. ఆ తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నటిగా మంచి మార్కులు కొట్టేసింది. నెమ్మదిగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకంటూ స్టార్ డమ్ సంపాదించుకుంది. కట్ చేస్తే.. తక్కువ సమయంలోనే బాలీవుడ్ సినిమా ప్రపంచాన్ని ఏలేసింది. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది. కానీ మొదట్లో ఆమె నల్లగా ఉందని.. హీరోయిన్ మెటిరీయల్ కాదంటూ దారుణంగా అవమానించారట. ఆమె మరెవరో కాదండి.. బాలీవుడ్ హీరోయిన్ కాజోల్.

ఇవి కూడా చదవండి : Actress : ఎలాంటి డైట్ లేకుండా 35 కిలోల బరువు తగ్గిన హీరోయిన్.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..

ఇవి కూడా చదవండి

కాజోల్.. సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు. ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. అంతేకాదు.. అప్పట్లో యూత్ ఆరాధ్య దేవత. షారుఖ్, సల్మా్న్ వంటి స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్స్ అందుకుంది. దాదాపు 32 ఏళ్లుగా సినిమా ప్రపంచంలో సత్తా చాటుతున్న ఈ అమ్మడు.. బీటౌన్ స్టార్ అజయ్ దేవగన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి బాబు, పాప ఉన్నారు. కాజోల్ తల్లిదండ్రులు ఇద్దరూ సినిమా రంగానికి చెందినవారే. ఆమె తండ్రి నిర్మాత, దర్శకుడు సోము ముఖర్జీ. తల్లి నటి తనూజ.

ఇవి కూడా చదవండి : Serial Actress: ఆఫర్స్ కోసం వెళితే కమిట్మెంట్ అడిగారు.. అలా ఆకలి తీర్చుకున్నా.. సీరియల్ బ్యూటీ ఎమోషనల్..

1992లో బేఖుది సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. అప్పుడు ఆమె వయసు 17 సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజోల్.. కెరీర్ మొదట్లో అడిషన్స్ కోసం వెళ్తే కొందరు అవమానించారని గుర్తు చేసుకుంది. నల్లగా ఉన్నావని.. లావుగా ఉన్నావని ఎగతాళి చేశారని.. నువ్వు హీరోయిన్ ఏంటీ అని కామెంట్స్ చేశారని.. ఆ సమయంలో ఎంతో బాధపడ్డానని చెప్పుకొచ్చింది. తన లుక్స్ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నానని చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి : Actress : ఎలాంటి డైట్ లేకుండా 35 కిలోల బరువు తగ్గిన హీరోయిన్.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..

ఇవి కూడా చదవండి : గ్లామర్‏లో అరాచకం.. అందం ఉన్న కలిసిరాని అదృష్టం.. క్రేజ్ పీక్స్..