
టాలీవుడ్ చందమామ కాజల్ గురించి చెప్పక్కర్లేదు. లక్ష్మీ కళ్యాణం సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత చందమామ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో తెలుగుతోపాటు తమిళం భాషలలోనూ వరుస అవకాశాలు అందుకుంది. స్టార్ హీరోస్ అందరి సరసన నటించిన కాజల్..ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఆమె చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. అటు బాలకృష్ణ సినిమాతోపాటు.. ఇటు రామాయణం మూవీలో మండోదరి పాత్రలో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే కాజల్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ ది ఇండియా స్టారీ. దేశంలో జరుగుతున్న ఆహార కల్తీ, ఫుడ్ పాయిజన్ తదితర అంశాల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. చేతన్ డీకే దర్శకత్వం వహించిన ఈ సినిమాను జీ స్టూడియోస్ సమర్పణలో ఎంఐజీ ప్రొడక్షన్ అండ్ స్టూడియోస్ బ్యానర్ పై సాగర్ బీ షిండే నిర్మించారు. ఈ చిత్రాన్ని జూలై 24న రిలీజ్ చేయనున్నారు.
ఎక్కువ మంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : Kota Srinivasa Rao : ఆ హీరోలగా చేయాలంటే ఇంకో జన్మ ఎత్తాలి.. ఆరోజు అతడి కష్టాన్ని కళ్లరా చూశా.. కోట శ్రీనివాస్ రావు..
ఈ క్రమంలోనే ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటూ బిజీగా ఉంటుంది కాజల్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కాజల్ మాట్లాడుతూ.. సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ల నడుము చూపించడానికి ఆసక్తి చూపిస్తారని వస్తున్న అంశంపై ఆమె రియాక్ట్ అయ్యారు. గతంలో అలాంటి అపోహా ఉండవచ్చు అని.. కానీ ఇటీవల ఇండస్ట్రీ తనను తాను మార్చుకుంటుందని అన్నారు. అలాగే మీ ఫేవరెట్ హీరో ఎవరని అడగ్గా.. కాజల్ సమాధానమిచ్చారు. తనకు చిన్నప్పటి నుంచి సల్మాన్ అంటే చాలా ఇష్టమని.. అతడే తన క్రష్ అని తెలిపింది. తన చెల్లెలు నిషా.. షారుఖ్ అభిమాని అని తెలిపింది. సల్మాన్ ఖాన్ ను ఎవరైనా ఒక మాట అంటే అస్సలు ఊరుకునే దానిని కాదని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : Srikanth: ఆ సినిమా తర్వాత నా గ్రాఫ్ మొత్తం పడిపోయింది.. చాలా దెబ్బ పడింది.. హీరో శ్రీకాంత్..
ఇదిలా ఉంటే.. సల్మాన్ ఖాన్, రష్మిక మందన్నా జంటగా నటించిన సికిందర్ సినిమాలో కాజల్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సల్మాన్ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో మెప్పిస్తున్నారు. ఇప్పుడిప్పుడే సినిమాలకు గ్యాప్ తీసుకుంటున్న సల్మాన్.. తాజాగా లేటేస్ట్ లుక్కుతో అభిమానులును ఆశ్చర్యపరిచారు.
ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ హీరో చాలా గొప్ప మనిషి.. ఆయన పేరు వినగానే రజినీకాంత్ సిగరెట్ పడేసి నిలబడ్డారు.. తనికెళ్ల భరణి..
ఎక్కువ మంది చదివినవి : Sudhakar : నేను కోమాలో ఉన్నప్పుడు ఆసుపత్రికి వచ్చి చూసిన హీరో అతడే.. నటుడు సుధాకర్..