ఎన్టీఆర్‌ను తిట్టిన డైరెక్టర్.. అలిగి ఇంటికి వెళ్లిన యంగ్ టైగర్!

| Edited By:

Feb 02, 2020 | 10:38 AM

ఏంటి పైన హెడ్డింగ్ చూసి షాక్ అయ్యారా! నిజంగా అది నిజమే. అయినా.. ఎన్టీఆర్‌ని తిట్టే డైరెక్టర్లు కూడా ఉంటారా? అని ఆశ్చర్యపడకండి. అవును నిజంగానే ఎన్టీఆర్‌పై ఓ డైరెక్టర్ గట్టిగానే సీరియస్‌ అయ్యారు. దాంతో ఎన్టీఆర్‌ అలిగి.. షూటింగ్ మధ్యలోనే ఇంటికి వెళ్లిపోయారు. పైకి అమాయక ముఖంతో కనిపిస్తాడు కానీ.. ఎన్టీఆర్ అంటే.. అల్లరికి చిరునామా. అతని పక్కన నటించే హీరోయిన్స్‌నే కాకుండా.. డైరెక్టర్స్‌, సైడ్ యాక్టర్స్‌ని కూడా మనోడు వదలడు. ఏదో ఒక రూపంలో […]

ఎన్టీఆర్‌ను తిట్టిన డైరెక్టర్.. అలిగి ఇంటికి వెళ్లిన యంగ్ టైగర్!
Follow us on

ఏంటి పైన హెడ్డింగ్ చూసి షాక్ అయ్యారా! నిజంగా అది నిజమే. అయినా.. ఎన్టీఆర్‌ని తిట్టే డైరెక్టర్లు కూడా ఉంటారా? అని ఆశ్చర్యపడకండి. అవును నిజంగానే ఎన్టీఆర్‌పై ఓ డైరెక్టర్ గట్టిగానే సీరియస్‌ అయ్యారు. దాంతో ఎన్టీఆర్‌ అలిగి.. షూటింగ్ మధ్యలోనే ఇంటికి వెళ్లిపోయారు.

పైకి అమాయక ముఖంతో కనిపిస్తాడు కానీ.. ఎన్టీఆర్ అంటే.. అల్లరికి చిరునామా. అతని పక్కన నటించే హీరోయిన్స్‌నే కాకుండా.. డైరెక్టర్స్‌, సైడ్ యాక్టర్స్‌ని కూడా మనోడు వదలడు. ఏదో ఒక రూపంలో ఆట పట్టిస్తూ ఉంటాడు. అందులోనూ ముఖ్యంగా రాజమౌళి, వివి వినాయక్‌లు ఉంటే మనోడికి పండగే అని చెప్పకోచ్చు. వారితో ఎన్టీఆర్‌కి ఉన్న చనువు అలాంటిది.

ఇక ఎన్టీఆర్‌ని తిట్టిన డైరెక్టర్‌ ఎవరో తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉండొచ్చు. అక్కడికే వస్తున్నా. యంగ్ టైగర్ ఎన్టీఆర్.. బాల రాముడిగా నటించిన ‘బాల రామాయణం’లో.. ఎన్టీఆర్ చేసిన పనికి.. డైరెక్టర్ గుణశేఖర్ సీరియస్ అవ్వక తప్పలేదు. ఎందుకంటే.. అతని అల్లరి తట్టుకోవడం చాలా కష్టం. ఇదే విషయంపై ఎన్టీఆర్ తల్లి కూడా హరికృష్ణకు చాలాసార్లు ఫిర్యాదులు చేసేవారట.

ఇక ‘బాల రామాయణం’లో నటులంతా చిన్నపిల్లలే. ఇంకేముంది సినిమా సెట్టును.. పీకి పందిరి వేసేవారు. దానికి తోడు జూనియర్ ఎన్టీఆర్‌ అల్లరికి హద్దేలేదు. షూటింగ్‌కని తెచ్చిన బాణాలను విరగొట్టేవాడు. వానర సైన్యంపై సన్నివేశాల సమయంలో కూడా.. తన తోటి పిల్లలను బాణాలతో గుచ్చడం, తోకలు లాగటం, మూతులు పీకడం లాంటి అల్లరి పనులన్నీ చేసేవాడు.

అలాగే ఈ సారి కాస్త శృుతిమించి ఏకంగా శివధనుస్సునే విరిచేశాడు ఎన్టీఆర్. దీంతో.. గుణశేఖర్ ఎన్టీఆర్‌పై కేకలు వేస్తూ సీరియస్ అయ్యారట. దాంతో అలిగిన అల్లరి రాముడు ఇంటికి వెళ్లిపోయాటడ. మళ్లీ గుణశేఖరే వెళ్లి.. ఎన్టీఆర్‌ని బుజ్జగించి షూటింగ్‌కి తీసుకొచ్చారట. కాగా.. ఈ సినిమాకి గానూ డైరెక్టర్ గుణశేఖర్ నేషనల్ అవార్డు కూడా తీసుకున్నారు.