Jr.NTR: జాన్వీ కపూర్‏ను చూసి షాకయిన ఎన్టీఆర్.. NTR30 ఈవెంట్‏లో తారక్ ఫన్నీ రియాక్షన్..

|

Mar 23, 2023 | 10:50 AM

స్టేజ్ పై డైరెక్టర్ కొరటాల శివ పక్కనే ఉన్న జాన్వీ చూసి షాకయ్యాడు. అనంతరం ఆమె వద్దకు వచ్చి పలకరించాడు.

Jr.NTR: జాన్వీ కపూర్‏ను చూసి షాకయిన ఎన్టీఆర్.. NTR30 ఈవెంట్‏లో తారక్ ఫన్నీ రియాక్షన్..
Ntr 30 Movie
Follow us on

ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ మూవీ తర్వాత తారక్ నటించబోయే సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తారక్ చేయబోయే కొత్త ప్రాజెక్ట్ ఈరోజు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ రాజమాళి, డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ప్రకాష్ రాజ్, జాన్వీ కపూర్ హజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి వచ్చిన జాన్వీ కపూర్‎‏ను చూసి షాకయ్యాడు తారక్. స్టేజ్ పై డైరెక్టర్ కొరటాల శివ పక్కనే ఉన్న జాన్వీ చూసి షాకయ్యాడు. అనంతరం ఆమె వద్దకు వచ్చి పలకరించాడు. అయితే జాన్వీని చూడగానే ఎన్టీఆర్ ఇచ్చిన రియాక్షన్ కెమెరాలో క్లిక్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది.

ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంస్థ పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ, కె నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా జరిగిన పూజా కార్యక్రమాల్లో ఎన్టీఆర్, జాన్వి కపూర్ మీద చిత్రీకరించిన తొలి సన్నివేశానికి రాజమౌళి క్లాప్ ఇచ్చారు.

యంగ్ టైగర్ సినిమాతో తెలుగు తెరకు జాన్వీ పరిచయం కాబోతుంది. ఇప్పటికే జాన్వీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.