
గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటారు. ఈ హీరో అటు వెండితెరపైనే కాకుండా, సోషల్ మీడియాలోనూ తనదైన టైమింగ్‌తో అభిమానులను అలరిస్తుంటారు. సాధారణంగా ఎన్టీఆర్ నెట్టింట యాక్టివ్ గా ఉండడం.. తన పర్సనల్ విషయాలు చుకోవడం చాలా అరుదు. కానీ తాజాగా తారక్ తన అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు. ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే తారక్ తాజాగా తన ఫ్యాన్స్‌తో ఒక సామాన్యుడిలా ముచ్చటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక హంగామా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అసలు విషయానికి వస్తే.. ఎన్టీఆర్ మంచి నటుడే కాదు, అద్భుతమైన కుక్ (వంటగాడు) అని ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే. తాజాగా ఆయన మొదటిసారి తన ఇంట్లో కుకీస్ బేక్ చేసి, ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. “My First Bake #BakedNotBought” అంటూ పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఫొటోలను చూసిన సాయితేజ అనే ఒక అభిమాని ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. “అన్నా.. మా ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. మా కోసం రెండు కుకీలు పంపించవా?” అంటూ సరదాగా కోరారు. దీనికి ఎన్టీఆర్ స్పందించిన తీరు సోషల్ మీడియాను ఊపేస్తోంది.
ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ హీరో అద్భుతమైన వ్యక్తి.. వయసులో చిన్నోడైనా చేతులెత్తి నమస్కరిస్తున్నా..
ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం పాపులర్ మీమ్ ఆడియో అయిన “అడ్రస్ పెట్టు.. ఫాస్ట్‌గా అడ్రస్ పెట్టు” అనే వీడియో క్లిప్‌ను రిప్లైగా ఇస్తూ నెటిజన్లను నవ్వుల్లో ముంచెత్తారు. అభిమానికి లవ్లీ సర్ప్రైజ్!కేవలం సోషల్ మీడియాలో రిప్లై ఇవ్వడంతోనే సరిపెట్టకుండా, సదరు అభిమానికి నిజంగానే కుకీస్ పంపించి రియల్ సర్ప్రైజ్ ఇచ్చారు యంగ్ టైగర్. దాంతో ఆ అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.అలాగే, బిర్యానీ ప్రియుడిగా పేరున్న ఎన్టీఆర్ ఇలా కుకీస్ చేయడం చూసి మరో అభిమాని ఆశ్చర్యపోతూ.. “అన్నా.. బిర్యానీ, నాటుకోడి వండే నువ్వేంటి.. ఇలా కుకీస్ చేయడం ఏంటి?” అని ప్రశ్నించాడు.
ఎక్కువ మంది చదివినవి : Brahmanandam : చివరి రోజుల్లో ఎంఎస్ నారాయణ కోరిన ఆఖరి కోరిక అదే.. హాస్పిటల్ బెడ్ మీద అలా చూశాక.. బ్రహ్మానందం ఎమోషనల్..
దానికి కూడా తారక్ తన మార్క్ కామెడీ టైమింగ్ ప్రదర్శిస్తూ, ‘బాద్‌షా’ సినిమాలో బ్రహ్మానందం చెప్పిన ఫేమస్ డైలాగ్ “మారాయి.. అన్నీ మారాయి” అనే వీడియో క్లిప్‌ను షేర్ చేశారు. ఎన్టీఆర్ టైమింగ్‌కు, ఆయనలోని హ్యుమర్ సెన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.ప్రస్తుతం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ అనే భారీ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. అటు వెండితెరపై పవర్‌ఫుల్ యాక్షన్‌తో, ఇటు సోషల్ మీడియాలో ఇలాంటి లవ్లీ గెస్చర్స్ (ఆప్యాయత)తో తారక్ అందరి హృదయాలను గెలుచుకుంటున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Meenakshi Chaudhary : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. ఎప్పటికైన అతడితో డేట్‌కు వెళ్తాను.. హీరోయిన్ మీనాక్షి చౌదరి..
ట్వీట్స్..
Ma intlo iddaru chinna pillalu unnaru rendu cookie pampi anna @tarak9999 pic.twitter.com/VMlWucs3Cf
— saiteja (@saitejaathoti) June 5, 2026
Where is the biryani
Where is the natukodiii…
Tigerrr @tarak9999
What is this cookiesuuuu..BAKEDNOTBOUGHT ❤️🔥 https://t.co/kzWD24WKNz
— Tony (@NMeklaNTR) June 5, 2026
ఎక్కువ మంది చదివినవి : Peddi Movie : ఏం తీశాడు భయ్యా.. చరణ్ ఎంట్రీ మైండ్ బ్లోయింగ్.. ఆ ఒక్క సీన్ గూస్ బంప్స్..