ఎన్టీఆర్‌కి మ‌హిళ‌ల‌ను గౌర‌వించ‌డం తెల్సు..పాయ‌ల్ సంచ‌ల‌న ట్వీట్..

|

Jun 05, 2020 | 11:12 AM

ఇటీవ‌ల #AskMeera చాట్ లో భాగంగా త‌న‌కు ఇష్టమైన హీరో మ‌హేశ్ అని.. ఎన్టీఆర్ ఎవ‌రో నాకు తెలియ‌దని మీరా వ్యాఖ్యానించడం తీవ్ర చ‌ర్చ‌కు దారితీసింది.

ఎన్టీఆర్‌కి మ‌హిళ‌ల‌ను గౌర‌వించ‌డం తెల్సు..పాయ‌ల్ సంచ‌ల‌న ట్వీట్..
Follow us on

హీరోయిన్ మీరా చోప్రా, జూనియ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి మ‌ధ్య సోష‌ల్ మీడియా వేదిక‌గా భారీ వార్ న‌డుస్తోంది. ఇటీవ‌ల #AskMeera చాట్ లో భాగంగా త‌న‌కు ఇష్టమైన హీరో మ‌హేశ్ అని.. ఎన్టీఆర్ ఎవ‌రో నాకు తెలియ‌దని మీరా వ్యాఖ్యానించడం తీవ్ర చ‌ర్చ‌కు దారితీసింది. ఈ కామెంట్స్ పై తీవ్ర స్థాయిలో ఫైర‌యిన కొంద‌రు ఎన్టీఆర్ ఫ్యాన్స్.. మీరా చోప్రాని ట్రోల్ చేస్తూ అస‌భ్య‌ప‌ద‌జాలం ఉప‌యోగించారు‌. ఈ ఇష్యూపై ఆమె సైబ‌ర్ క్రైమ్‌లో పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. అంతేకాదు ఇటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఎలా నెగ్గుకురాగ‌ల‌రో తెలిపాలంటూ ఎన్టీఆర్ ను ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌శ్నించింది.

ఈ నేప‌థ్యంలో అనూహ్యంగా మ‌రో నటి పాయ‌ల్ ఘోష్ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చింది. త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా‌..ఆడ‌వాళ్ళ‌ని ఎన్టీఆర్ ఎలా గౌర‌విస్తారో వివ‌రించింది. మేము బ్యాంకాక్‌లో ఒక సాంగ్ కోసం షూటింగ్ చేస్తున్నాము. షూట్ లో భాగంగా నేను డ్ర‌స్ మార్చవలసి వచ్చింది. దీంతో నా టీమ్ ఒక చిన్న గుడారాన్ని ఏర్పాటు చేశారు. అందులోనే డ్ర‌స్ ఛేంజ్ చేసుకున్నాన‌న్న‌ విష‌యం తెలిసి తార‌క్ అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు. రోడ్డు ప‌క్క‌న మ‌హిళ‌ దుస్తులు మార్చుకోవాల్సి రావ‌డం ఎన్టీఆర్ ను ఎంత‌గానో క‌లిచివేసింది. అత‌డికి మహిళలను ఎలా గౌరవించాలో తెలుసు అంటూ పాయ‌ల్ ఘోష్ త‌న ట్విట్ట‌ర్ లో పేర్కొంది. ఈ సంఘ‌ట‌న ఊస‌ర‌వెల్లి మూవీ షూటింగ్ స‌మ‌యంలో జరిగింది. ఆ సినిమాలో పాయ‌ల్ ఘోస్ న‌టించిన విష‌యం తెలిసిందే.