
ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి సోదరుడు, టాలీవుడ్ యంగ్ హీరో నార్నే నితిన్ త్వరలోనే తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నాడు. బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెబుతూ వైవాహిక బంధంలోకి అడుగు పెడుతున్నాడీ క్రేజీ హీరో. తాజాగా శివానీ అనే అమ్మాయితో నార్నే నితిన్ నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. హైదరాబాద్ వేదికగా ఆదివారం (నవంబర్ 03) జరిగిన ఈ ఫంక్షన్ కు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, దగ్గుబాటి ఫ్యామిలీ కూడా హాజరయ్యారు. ఎన్టీఆర్ తో పాటు ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్, భార్గవ్లతోపాటు హీరో కళ్యాణ్ రామ్, వెంకటేశ్, రానా దగ్గుబాటి, నిర్మాత చినబాబు తదితరులు సందడి చేశారు. ఈ సందర్భంగా కాబోయే దంపతులను మనసారా ఆశీర్వదించారు. ప్రస్తుతం నార్నేనితిన్-శివానీల ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కాబోయే దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కాగా నార్నే నితిన్ కు కాబోయే ఎవరో తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. అదే సమయంలో వెంకీ మామకు ఆమెకు ఉన్న సంబంధమేంటోనని ఆరా తీస్తున్నారు. నార్నే నితిన్ ఎంగేజ్మెంట్ చేసుకున్న శివానీ మరెవరో కాదు.. హీరో దగ్గుబాటి వెంకటేష్ ఫ్యామిలీకి దగ్గరి బంధువులైన అయిన తాళ్లూరి వెంకట కృష్ణప్రసాద్.. స్వరూపల కూతురు. వెంకీమామకు శివానీ.. కజిన్ డాటర్ అవుతుంది. ఇప్పుడు శివానీకి ఎన్టీఆర్ బావమరిదితో శివానీకి నిశ్చితార్థం జరగడంతో.. వీరి కుటుంబ సభ్యులు ఇక చుట్టాలైపోయినట్లే.
కాగా నార్నే నితిన్ ఎంగేజ్ మెంట్ వేడుకలో హారిక హాసిని ఎంటర్టైన్మెంట్స్ అధినేత చినబాబు, సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం మ్యాడ్ 2 సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు నార్నే నితిన్. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.