
నందమూరి బాలకృష్ణ తన కొత్త ప్రాజెక్టు #NBK111 చిత్ర షూటింగ్‌లో ప్రమాదవశాత్తూ గాయపడిన సంగతి తెలిసిందే. కాకినాడ పరిసర ప్రాంతాల్లో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో జరుగుతున్న ఈ సినిమా చిత్రీకరణలో ఆయనకు గాయమైనట్లు సమాచారం. ఈ విషయం తెలియడంతో బాలకృష్ణ అభిమానులు, సినీ ప్రతినిధులు, నందమూరి కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు. ఈ క్రమంలోనే మంత్రి నారా లోకేశ్, నటులు జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కల్యాణ్ రామ్‌లు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వేర్వేరుగా పోస్టులు పెడుతూ బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.
లోకేశ్ పరామర్శ
కాకినాడలో జరుగుతున్న సినిమా షూటింగ్ లో గాయపడిన మావయ్య నందమూరి బాలకృష్ణను ఫోన్‌లో పరామర్శించినట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నానని పేర్కొన్నారు. “బాలా మావయ్య త్వరగా కోలుకుని, యథావిధిగా షూటింగ్‌లో పాల్గొంటారని ఆకాంక్షిస్తున్నాను” అని ఆయన ట్వీట్ చేశారు.
ఎక్కువ మంది చదివినవి : Sudhakar : నేను కోమాలో ఉన్నప్పుడు ఆసుపత్రికి వచ్చి చూసిన హీరో అతడే.. నటుడు సుధాకర్..
గర్జించాలని అభిలషిస్తున్నా: ఎన్టీఆర్
నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) స్పందిస్తూ.. “బాలా బాబాయ్ మీరు త్వరగా కోలుకోవాలి. సంపూర్ణ ఆరోగ్యం, సామర్థ్యంతో తిరిగి గర్జించాలని అభిలషిస్తున్నాను” అని రాసుకొచ్చారు.
Get well soon Bala Babai. Wishing you a speedy recovery and good health. Looking forward to seeing you roar back in full form…
— Jr NTR (@tarak9999) July 21, 2026
యాక్షన్ మోడ్‌లోకి రావాలి: కల్యాణ్‌రామ్
నందమూరి కల్యాణ్‌రామ్ స్పందిస్తూ.. “బాబాయ్ మీరు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. మీరు అమితంగా ప్రేమించే పని చేయడానికి తక్కువ సమయంలోనే మళ్లీ యాక్షన్ మోడ్‌లోకి రావాలని కోరుకుంటున్నాను” అని ఆకాంక్షించారు.
ప్రస్తుతం బాలకృష్ణకు ప్రాథమిక చికిత్స అందించగా, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. అభిమానులు , చిత్రబృందం ఆయన త్వరలోనే పూర్తి కోలుకుని షూటింగ్‌లో పాల్గొనాలని కోరుకుంటున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ హీరో చాలా గొప్ప మనిషి.. ఆయన పేరు వినగానే రజినీకాంత్ సిగరెట్ పడేసి నిలబడ్డారు.. తనికెళ్ల భరణి..