Janhvi Kapoor: జాన్వీ కపూర్ సినిమాపై లేడీ సూపర్ స్టార్ ప్రశంసలు.. తెగ మురిసిపోయిన హీరోయిన్..

|

Aug 05, 2022 | 10:09 PM

తమిళంలో నయతార నటించగా.. ఇప్పుడు హిందీలో జాన్వీ కపూర్ నటించింది. తాజాగా తన సినిమాపై లేడీ సూపర్ స్టార్ ప్రశంసలు కురిపించిందంటూ సంతోషం వ్యక్తం చేసింది జాన్వీ.

Janhvi Kapoor: జాన్వీ కపూర్ సినిమాపై లేడీ సూపర్ స్టార్ ప్రశంసలు.. తెగ మురిసిపోయిన హీరోయిన్..
Nayan
Follow us on

ధకడ్ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసి.. నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది జాన్వీ కపూర్ (janhvi kapoor). మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ చిన్నది.. ఇప్పుడు బీటౌన్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. అతి తక్కువ సమయంలోనే తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్న జాన్వీ.. ప్రస్తుతం గుడ్ లక్ జెర్రీ (Good Luck Jerry) సినిమాతో ప్రేక్షకు ముందుకు వచ్చింది. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. 2018లో వచ్చిన కొలమావు కోకిల (తెలుగులో కోకో కోకిల) అనే తమిళ సినిమాకు రీమేక్. తమిళంలో నయతార నటించగా.. ఇప్పుడు హిందీలో జాన్వీ కపూర్ నటించింది. తాజాగా తన సినిమాపై లేడీ సూపర్ స్టార్ ప్రశంసలు కురిపించిందంటూ సంతోషం వ్యక్తం చేసింది జాన్వీ.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న జాన్వీ మాట్లాడుతూ.. నయనతార ట్రైలర్ పై సానుకూలంగా స్పందించారని చదివాను. నా గురించి.. నా సినిమా ట్రైలర్ గురించి చెప్పడం చాలా ప్రత్యేకం. ఆమె నంబర్ తెలుసుకుని ధన్యవాదాలు అంటూ మెసేజ్ చేశారు. అందుకు ఆమె రిప్లై ఇచ్చింది. ఆరోజు చాలా ప్రత్యేకంగా అనిపించింది. కెరీర్ ప్రారంభంలోనే నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర పోషించినందుకు గర్వపడుతున్నాను అంటూ మెసేజ్ చేసింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది.

గుడ్ లక్ జెర్రీ విడుదలకు ముందు నయనతార జాన్వీకి గుడ్ లక్ అంటూ మెసేజ్ చేసింది. కోకిల నా మనసుకు చాలా దగ్గరైన పాత్ర. గుడ్ లక్ జెర్రీ ట్రైలర్ చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని అందించావు. గుడ్ లక్ జాన్వీ అంటూ మెసేజ్ చేసింది నయన్.