Jagapathi Babu : అక్కడ ఇచ్చిన మర్యాద ఇక్కడ దొరకలేదు .. ఆసక్తికర విషయాలు చెప్పిన జగ్గూభాయ్..

|

Feb 28, 2021 | 2:50 PM

హీరోగా ఎంట్రీ ఇచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ లో చెరగని ముద్ర వేసుకున్నారు జగపతిబాబు. అప్పట్లో జగపతిబాబు క్రేజ్ మాములుగా ఉండేది కాదు.. ఆడవాళ్ళలో మరీను.

Jagapathi Babu : అక్కడ ఇచ్చిన మర్యాద ఇక్కడ దొరకలేదు .. ఆసక్తికర విషయాలు చెప్పిన జగ్గూభాయ్..
Follow us on

Jagapathi Babu about tollywood : హీరోగా ఎంట్రీ ఇచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ లో చెరగని ముద్ర వేసుకున్నారు జగపతిబాబు. అప్పట్లో జగపతిబాబు క్రేజ్ మాములుగా ఉండేది కాదు.. ఆడవాళ్ళలో మరీను. హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసారు జగపతిబాబు. ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలతోనే కాకుండా అంతఃపురం లాంటి సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నారు జగపతిబాబు.

అయితే అనుకోకుండా ఆయన కొంతకాలం సినిమాలు దూరమయ్యారు . ఇక జగపతి బాబు సినిమాలో కనిపించరు అనుకుంటున్నా సమయంలో లెజెండ్ సినిమాతో విలన్ గా అవతారమెత్తారు. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ఈ సినిమాలో జగపతి బాబు విలన్ గా నటించారు. ఇక ఈ సినిమాలో జగ్గూభాయ్ విలనిజాన్ని ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆతర్వాత తిరిగి క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా మెప్పిస్తున్నారు జగపతిబాబు. తన డైన నటనతో గంభీరమైన స్వరంగా సినిమాకే ఆయన హైలెట్ గా నిలుస్తున్నారు.

తాజాగా జగపతిబాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టాలీవుడ్ పైన ఆసక్తికర కామెంట్లు చేశారు. ఇటీవల జగపతిబాబు రాబర్ట్ అనే కన్నడ సినిమాలో నటించారు. ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. కాగా ఈ సినిమాలో జగపతిబాబు కీలక పాత్రలో నటించారు. ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా జగపతి బాబు మాట్లాడుతూ.. కన్నడ ప్రేక్షకులు ఇచ్చిన రెస్పెట్ తెలుగువారుకూడా ఇవ్వలేదు అంటూ.. కామెంట్ చేశారు. అక్కడి వారు మా ఇంటికి వచ్చారు అంటూ చాలా మర్యాదగా చూసుకుంటారు అంటూ చెప్పుకొచ్చాడు జగపతిబాబు.