Jabardasth Shanthi Swaroop: నాన్న చనిపోయినప్పుడు చేతిలో చిల్లిగవ్వలేదు.. అతనే అంత్యక్రియలకు సాయం చేశాడు

జబర్దస్త్ శాంతి స్వరూప్ ఆ మధ్యన ఒక ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఇదే సందర్భంగా తండ్రి చనిపోయినప్పుడు తన దీన పరిస్థితి గురించి చెబుతూ బాగా ఎమోషనల్ అయ్యాడు.

Jabardasth Shanthi Swaroop: నాన్న చనిపోయినప్పుడు చేతిలో చిల్లిగవ్వలేదు.. అతనే అంత్యక్రియలకు సాయం చేశాడు
Jabardasth Shanthi Swaroop

Updated on: May 28, 2026 | 9:50 AM

జబర్దస్త్ మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో శాంతి స్వరూప్ ఒకడు. చాలా ఏళ్లుగా ఈ షోలో కొనసాగుతున్న అతను తన కామెడీతో బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. ముఖ్యంగా ఇప్పుడు జబర్దస్త్ లో లేడీ కమెడియన్స్ ఉన్నప్పటికీ అతను మాత్రం విచిత్రమైన లేడీ గెటప్స్ తోనే అందరినీ నవ్విస్తున్నాడు. కేవలం జబర్దస్త్ లోనే కాదు శ్రీదేవి డ్రామా కంపెనీ తదితర టీవీ ప్రోగ్రామ్స్ లోనూ సందడి చేస్తున్నాడు. అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లోనూ మెరుస్తున్నాడు. అయితే చాలా మంది జబర్దస్త్ ఆర్టిస్టుల్లాగే శాంతి స్వరూప్ కూడా ఎన్నో ఇబ్బందులను అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నాడు. స్క్రీన్ పై ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అతని జీవితంలో చాలా మందికి తెలియని కన్నీటి కష్టాలు ఉన్నాయి. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెబుతూ బాగా ఎమోషనల్ అయ్యాడీ జబర్దస్త్ కమెడియన్. నిరుపేద కుటుంబంలో పుట్టిన తనకు ఒకప్పుడు జీవితంలో కష్టాలు, కన్నీరు తప్ప మరోటి లేవని వాపోయాడు.

‘మాది పెద్ద కుటుంబమే కానీ నిరుపేద జీవితం. నాకు జబర్దస్త్ ద్వారానే మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఈ షో నుంచి మాకు వచ్చేది తక్కువే. బయట ఈవెంట్స్ చేసినప్పుడు మాత్రం డబ్బులు బాగా చేతికి అందుతాయి. 2007లో నాన్న చనిపోయినప్పుడు నేను నరకం చూసాను. అప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్నాను. నాన్న అంత్యక్రియల కోసం రూ.2వేలు కావాల్సి వచ్చింది. కానీ అప్పుడు నా వద్ద కనీసం రూ. 500 కూడా లేవు. ఎవరినీ అడగాలో తెలియక ఏడుస్తూ ఉండిపోయాను. చివరికీ నేను అసిస్టెంట్ గా పని చేస్తున్న ఓ అన్న దగ్గర అప్పు తీసుకున్నాను. ఆయన అకౌంట్ నంబర్ అడిగితే అప్పుడు నా దగ్గర అది కూడా లేదు.చివరకు మా ఇంటి పక్కన ఎవరో అకౌంట్‌లో వేస్తే ఆ డబ్బు తీసుకొని ఊరికి వెళ్లి నాన్న అంత్యక్రియలు పూర్తి చేశా’ అని అప్పటి చేదు అనుభవాలను గుర్తు చేసుకన్నాడు శాంతి స్వరూప్.

ఇవి కూడా చదవండి

శాంతి స్వరూప్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

కాగా ఇప్పుడు జబర్దస్త్ తో పాటు ఈవెంట్స్ చేస్తున్నానని, ఇప్పుడు మంచి స్థానంలో ఉన్నానంటున్నాడు శాంతి స్వరూప్. ఆర్థికంగా కూడా బాగానే కుదురుకున్నానంటున్నాడు.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us