
జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు వెలుగులోకి వచ్చారు. తన ట్యాలెంట్ తో సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు. హీరోలుగా, కమెడియన్లుగా, సహాయక నటులుగా, నిర్మాతలుగా, డైరెక్టర్లుగా తమ కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుచకుంటున్నారు. అలా జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు వెండితెరపై బిజీగా ఉన్న వారిలో సత్య శ్రీ ఒకరు. జబర్దస్త్ వేదికపై చమ్మక్ చంద్రతో కలిసి ఆమె చేసిన స్కిట్స్ కు బుల్లితెర అభిమానుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే అనూహ్యంగా చమ్మక్ చంద్ర జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సత్య శ్రీ కూడా బయటకు వచ్చేసింది. ప్రస్తుతం సినిమాల్లో లేడీ కమెడియన్ గా, సహాయక నటిగా మెప్పిస్తోంది. ఆ మధ్యన నితిన్ ఎక్స్‌ట్రార్డినరి సినిమాలో కనిపించిన ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ గా నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమాలోనూ మెరిసింది. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన సత్య తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అలాగే సినిమా ఇండస్ట్రీలో తనకు ఎదురైన అవమానాలు, ఛీత్కారాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యింది.
కాగా సత్యశ్రీ తల్లి పలు తెలుగు సినిమాల్లో యాక్ట్ చేసింది. `పెదరాయుడు`లో బ్రహ్మానందంకి భార్యగా చేసింది సత్యశ్రీ తల్లినే. దీంతో పాటు పలు తెలుగు సినిమాల్లోనూ ఆమె నటించింది. ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ తనకు అవమానాలు తప్పలేదని సత్య శ్రీ వాపోయింది. ‘ కెరీర్ ప్రారంభంలో చాలా ఆఫీస్‌ల చుట్టూ తిరిగాను. చాలా అవమానాలు ఎదుర్కొన్నాను. . ఆఫర్స్ ఇవ్వాలని అడిగితే, కొందరు మొహం మీదే అవమానించారు. నువ్వు యాక్టింగ్ చేస్తావా? అసలు యాక్టింగ్ వచ్చా? ఈ మొహంతో యాక్టింగ్ చేస్తావా? అంటూ దారుణంగా అవమానించారు. సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా కూడా అవమానాలు, ఎదురుదెబ్బలు తగిలాయి.అయితే నేను వాటిని పాజిటివ్ గా తీసుకున్నాను. వాటినే ఆయుధంగా మలుచుకుని నటిగా నిరూపించుకున్నాను. అమ్మ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే నేను ఇండస్ట్రీలోకి వచ్చాక ఆమె సినిమాలు మానేసింది. ఇప్పుడు నాకు సపోర్ట్ గా నాతోనే ఉంటోంది. నేను సంపాదిస్తున్నాను కాబట్టి అమ్మ వర్క్ చేయాల్సిన పనిలేదు’ అని చెప్పుకొచ్చింది సత్య శ్రీ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.