
అనుకున్నట్టు గానే విజయ్ దేవకొండ , రష్మిక పెళ్లి చేసుకోబోతున్నారు. విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న పెళ్లి పత్రిక వైరల్ అవుతుంది. పెళ్లికి అతిథులను ఆహ్వానిస్తున్నారు విజయ్ దేవకొండ , రష్మిక జంట. వీరి వివాహం ఫిబ్రవరి 26న గ్రాండ్ గా జరగనుంది. అత్యంత సన్నిహితుల మధ్య విజయ్ దేవకొండ, రష్మిక పెళ్లి జరగనుందని తెలుస్తుంది. కాగా
మార్చి 4న తాజ్ కృష్ణలో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.
గత కొంతకాలంగా ప్రేమలో తేలిపోతున్న విజయ్, రష్మిక ఇప్పుడు వివాహబంధంతో ఒక్కటి కాబోతున్నారు. నెట్టింట వీరి పెళ్లి వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలే వీరిద్దరికి ఎంగేజ్‌మెంట్ అయినట్లు వార్చలొచ్చాయి. అయితే ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. కానీ రష్మిక, విజయ్ చేతులకు ఎంగేజ్మెంట్ రింగ్స్ ఉన్నాయని, త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నారని ఫ్యాన్స్ తెగ సంతోషపడిపోయారు. ఇప్పుడు ఏకంగా వీరి పెళ్లి పత్రిక వైరల్ అవుతుంది . ఫిబ్రవరి 26న వీరి వివాహం కొంతమంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరుగనుంది. ఆతర్వాత హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ జరగనుందని తెలుస్తుంది. గత ఏడాది అక్టోబర్ 03న విజయదేవరకొండ ఇంట్లో ఈ ఇద్దరి ఎంగేజ్మెంట్ నిర్వహించారు. ఈ ఎంగేజ్మెంట్ చాలా సైలెంట్ గా నిర్వహించారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి