
Akkineni Nagarjuna : సీనియర్ హీరో నాగార్జున ప్రజంట్ ఆచితూచి కథలను ఎంచుకుంటున్నారు. కథలో వైవిధ్యం, పాత్రలో ప్రాముఖ్యత ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటి జనరేషన్ కి తగ్గట్టుగా న్యూ ఏజ్ ఫిల్మ్స్ పై ఫోకస్ పెట్టారు. తాజాగా మరో క్రేజీ దర్శకుడితో సినిమాకు పచ్చజెండా ఊపారు. ‘గుంటూరు టాకీస్’, ‘గరుడవేగ’ సినిమాలతో సత్తా చాటిన దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో మూవీ చేయబోతున్నారు. పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది.
ఏషియన్ గ్రూప్ ఛైర్మన్ నారాయణదాస్ నారంగ్ బర్త్ డే సందర్భంగా, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నాగార్జున-ప్రవీణ్ సత్తారుల చిత్రం నిర్మిస్తున్నట్లు అనౌన్స్ చేశాయి. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో షూటింగులు నిలిచిపోయాయి. పరిస్థితులు కుదుటపడ్డ అనంతరం ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. ప్రస్తుతం నాగార్జున ‘వైల్డ్ డాగ్’ మూవీలో నటిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కతోన్న ఈ సినిమా షూటింగ్ తుదిదశకు చేరుకుంది. అది పూర్తయిన వెంటనే ప్రవీణ్ సత్తారు సినిమా కోసం నాగ్ డేట్స్ ఇచ్చారు.
Read More : వెబ్ సిరీస్ వైపు హైబ్రీడ్ పిల్ల అడుగులు