‘ఇస్మార్ట్ శంకర్’ బాక్స్ ఆఫీస్ దగ్గర స్లో అవ్వడానికి అస్సలు ఇష్ట పడటం లేదు, మూడు రోజుల్లో అద్బుతమైన వసూళ్లు సాధించిన ఈ సినిమా నాలుగో రోజు కూడా అన్ని చోట్లా అద్బుతంగా హోల్డ్ చేసి కలెక్షన్స్ సాధిస్తూ దూసుకు పోతుంది. వీకెండ్ కావడంతో మాస్ ఆడియెన్స్ ఎగబడి థియేటర్స్‌కు వస్తున్నారు. టాలీవుడ్‌లో మంచి మాస్ మూవీ వచ్చి చాలా కాలమే అయింది. మంచి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో అదిరిపోయే మ్యూజిక్‌తో, హీరోల ఎలివేషన్స్‌తో కూడిన సినిమాలు ఒక్కటి కూడా ఈ మధ్య రాలేదు. ఆ లోటుని బర్తీ చేస్తూ వచ్చిన రామ్ “ఇస్మార్ట్ శంకర్” బాక్స్ ఆఫీస్‌ను ఓ రేంజ్‌లో ఏలుతోంది. ఎంతలా అంటే అనుకున్న అంచనాలను కూడా ఓ రేంజ్‌లో మించి పోయే లెవల్‌లో బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపేసింది. రెస్పాన్స్ చూసి చాలా ఏరియాల్లో ఎక్స్ ట్రా థియేటర్స్‌ని కూడా యాడ్ చేశారు. ఇప్పటి వరకు రామ్ కెరీర్లో ఎన్నడూ చూడని వసూళ్లు ఈ సినిమాకి వచ్చాయి.
ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.48 కోట్లు రాబట్టినట్లు చిత్ర యూనిట్ అఫిసియల్‌గా ఎనౌన్స్ చేసింది. 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఇస్మార్ట్ శంకర్ మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ దాటేసింది. ఇప్పుడు వచ్చేదంతా ప్రాపిటే. ఏది ఏమైనా సరైన మాస్ సినిమా వస్తే ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఆదరిస్తారనేదానికి ‘ఇస్మార్ట్ శంకర్’ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.